navitha
-
థ్రిల్లింగ్‌గా ‘1000 వాలా’ టీజర్
అమిత్, షారుఖ్, నవిత, కీర్తి, సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘1000 వాలా’. అఫ్జల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. లైక్స్ మరియు కామెంట్స్ చూసి మా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అనే నమ్మకం కలిగింది. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అని తెలిపారు. -
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి
హిందూపురం ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన హిందూపురం అర్బన్ : స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగీ లక్షణాలతో చిన్నారి నవిత (4) మంగళవారం మతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పాప ప్రాణాలు కోల్పోయిందని చిన్నారి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. మడకశిర మండలం కెరసానిపల్లికి చెందిన నాగమణి, నరసింహులు దంపతుల కుమార్తె నవితకు జ్వరం రావడంతో ఈనెల 17వ తేదీ హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు చేసి హైఫీవర్ ఉంది. రెండు రోజుల్లో పరిస్థితి మెరుగు పడుతుందని భరోసా ఇచ్చారు. నాలుగు రోజుల నుంచి చికిత్స అందిస్తున్న డాక్టర్లు జ్వరం తగ్గుతుందని చెబుతూ వచ్చారు. కాగా మంగళవారం ఉదయం నవితకు జ్వరం ఎక్కువైంది. ఈ క్రమంలో ఫిట్స్ మొదలై కొంతసేపటికే శరీరం చల్లబడిపోయింది. గమనించిన తల్లి నాగమణి వెంటనే వైద్యులను తీసుకొచ్చింది. పరీక్షించిన డాక్టర్లు హైఫీవర్ కారణంగా చనిపోయిందన్నారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన చిన్నారి నవిత చనిపోయిందనే విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయిందని ఆరోపించారు. వైద్యులతో పాటు సూపరింటెండెంట్ కేశవులతో వ్వాగాదానికి దిగారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్ఐలు దిలీప్, వెంకటేశులు, సిబ్బంది అక్కడికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
తాడిపత్రి: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి బకెట్లో పడి మృతి చెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దలవిన్న గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రసాద్, లక్ష్మీ దంపతులకు రెండేళ్ల చిన్నారి నవిత. ఈ రోజు ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశత్తూ నీటి బకెట్లో పడి ఊపిరాడక మృతి చెందింది. తండ్రి వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో తల్లి ఇంటి పని చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.