Nedurumalli janardhan reddy
-
పులులకు బెబ్బులి..వెంకటగిరి చివరిరాజు
సాక్షి, వెంకటగిరి(నెల్లూరు) : వెంకటగిరి రాజుల కీర్తి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తం అనడం అతిశయోక్తి కాదు. వెంకటగిరి రాజాలు అనగానే నేటితరం వారికి పెద్దరాజాగా కీర్తి గడించిన వెలుగోటి వెంకటశేష వరదరాజ గోపాలకృష్ణ యాచేంద్ర (వీవీఆర్కే యాచేంద్ర) వెంటనే గుర్తుకు వస్తారు. వెంకటగిరి సంస్థానం 31వ తరానికి చెందిన ఆయన క్రీడలు, వ్యాపార, రాజకీయ రంగాల్లో విశిష్టతను చాటారు. వేటాడడం అంటే ఆయనకు మహా సరదా. ఆయన హయాంలో పెద్దపులులు (బెంగాల్ టైగర్స్)ను వేటాడారు. వీవీఆర్కే యాచేంద్ర 2010 జూన్ 29వ తేదీన ఆయన హైదరాబాద్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈయన వెంకటగిరి సంస్థానం చివరి పట్టాభిషిక్తుడిగా కీర్తి గడించారు. శనివారం ఆయన 9వ వర్ధంతి సందర్భంగా కైవల్యానది వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహం వద్ద వీవీఆర్కే యాచేంద్ర వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వెంకటగిరి ప్రాంతంలోని వెలుగొండలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి మొదలగు ప్రాంతాల్లో అడవుల్లో ఆయన వేట సాగించేవారని ఆనాటి తరం వారు చెబుతున్నారు. ఓ చేత్తో జీప్ నడుపుతూ గన్‌తో వేటాడడంలో ఆయన దిట్ట. ఇక 1954 –1960 మధ్య ప్రాంతంలో ఆంధ్రా రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. రాజకీయ రంగంలో 1967 –1973 మధ్య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1994లో వెంకటగిరి శాసనసభ్యుడిగా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి విజయం సాధించి గుర్తింపు సాధించారు. ఇక వెంకటగిరి పాలకేంద్రం సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసే సమయంలో ఐదు ఎకరాలు, గోషాస్పత్రి ఏర్పాటు కోసస్పైదు ఎకరాలు, సత్యసాయి వరదరాజపురంగా పిలచే మందరిల్లు ప్రాంతంలో పేదలకు నివాసాల కోసం, ఉపాధ్యాయనగర్ సమీపంలో చేనేత కార్మికుల నివాసాల కోసం వీవర్స్‌కాలనీ, ఉపాధ్యాయనగర్ను నామమాత్రం ధరకు ఉపాధ్యాయుల నివాసాల కోసం అందించి వెంకటగిరి ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన కుమారులు రాంప్రసాద్ యాచేంద్ర, డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రతోపాలు మనవడు సర్వజ్ఞకుమార యాచేంద్ర ప్రస్తుతం వెంకటగిరి వైఎస్సార్సీపీలో కీలక నేతలుగా ఉంటూ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సన్నిహితులుగా మెలుగుతున్నారు. -
నేదురుమల్లి ఇకలేరు
-
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కన్నుమూత
-
నేదురుమల్లికి ప్రముఖులు నివాళులు
హైదరాబాద్ : అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ....నేదురుమల్లి భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం నేదురుమల్లి జనార్దనరెడ్డి భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం వాకాడు తీసుకు వెళతారు. కుటుంబ సభ్యులు రేపు సాయంత్రం నేదురుమల్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
'తొలిగా నక్సల్స్‌పై నిషేధం విధించిన నేదురుమల్లి'
హైదరాబాద్ : నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించారు. 1992 మేలో నక్సల్స్‌పై నిషేధం విధిస్తూ ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నేదురుమల్లి నక్సలైట్ల హిట్‌లిస్ట్‌లో చేరారు. సెప్టెంబర్ 7 2007లో జనార్ధనరెడ్డి ప్రయాణిస్తున్న కారును పేల్చివేసేందుకు నక్సల్స్ ప్రయత్నించారు. ఈ ఘటనలో నేదురుమల్లి, ఆయన సతీమణి రాజ్యలక్ష్మి నుంచి తృటిలో ప్రాణాపాయంతో బయటపడగా, ముగ్గురు కార్యకర్తలు మరణించారు. 2003లోనూ ఇదే తరహా దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి 1935 ఫిబ్రవరి 20న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులో జన్మించారు. నెల్లూరులో బీఏ, బీఈడీ చదివారు. 1962 మే 25న రాజ్యలక్ష్మితో ఆయన వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు. నేదురమల్లి రాజ్యలక్ష్మి సైతం 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన నేదురుమల్లి రాజకీయ ప్రస్థానం 1972లో ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత పీసీసీ సెక్రటరీగా పనిచేశారు. 1978లో శాసనసభకు పోటీచేసిన నేదురుమల్లి... మంత్రివర్గంలో స్థానం పొందారు. ఆ తర్వాత 1988లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. చెన్నారెడ్డి అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనార్ధనరెడ్డి... దాదాపు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. 1998, 99లో మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 1999 నుంచి మూడేళ్లపాటు అతి ముఖ్యమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. 2004లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో రిజర్వ్డ్గా ఉన్న నెల్లూరు లోక్‌సభ జనరల్‌గా మారడంతో... పోటీచేయాలని భావించినా ఆయనకు సీటు లభించలేదు. ఫలితంగా మరోసారి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. -
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కన్నుమూత
హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన... ఈరోజు ఉదయం అయిదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. నేదురుమల్లి భౌతికకాయాన్ని సోమాజిగూడలోని ఆయన స్వగృహానికి తరలించారు. నేదురుమల్లి రాజకీయాల్లో పలు కీలక పదవులు చేపట్టారు. ముఖ్యమంత్రిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఆయన పనిచేశారు. వీటితో పాటు పార్టీ సంస్థాగత పదవులను ఆయన చేపట్టారు. నేదురుమల్లి మరణం తీరనిలోటని ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన లోటు పూడ్చలేనిదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.