neeharika
-
రజతం నెగ్గిన నిహారిక
ఇస్తాంబుల్ (టర్కీ): అహ్మెట్ కామెర్ట్ కప్ యూత్ అండర్–18 అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ బాక్సర్ గోనెళ్ల నిహారిక రజత పతకం గెలిచింది. ఈ టోర్నీలో భారత బాక్సర్లకు స్వర్ణం, 4 రజతాలు, నాలుగు కాంస్య పతకాలు లభించాయి. 75 కేజీల విభాగంలో పోటీపడిన 16 ఏళ్ల నిహారిక ఫైనల్లో 0–5తో అనస్తాసియా షమోనోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున సోనియా (48 కేజీలు) స్వర్ణం సాధించగా... అంకుషితా బోరో (60 కేజీలు), పర్వీన్ (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు) రజతాలు గెలిచారు. జ్యోతి గులియా (48 కేజీలు), లలిత, మనీషా (64 కేజీలు), తిలోత్తమ చాను (60 కేజీలు) కాంస్యాలు గెలిచారు. -
వ్యభిచారం కేసులో జూనియర్ ఆర్టిస్టు
-
వ్యభిచారం కేసులో పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్టు
ఎల్బీనగర్ ప్రాంతంలో వ్యభిచారం చేస్తూ నీహారిక అనే జూనియర్ ఆర్టిస్టు పట్టుబడింది. ఈ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని పక్కా సమాచారం అందడంతో స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ దాడులు చేయడంతో ఆమెతో పాటు భారీ సంఖ్యలో యువతులు, పలువురు పురుషులు పట్టుబడ్డారు. పట్టుబడ్డవారిలో ప్రముఖులు, బడా వ్యాపారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఎక్కువగా శివారు ప్రాంతాల్లోనే ఈ తరహా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఎల్బీనగర్, మాదాపూర్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో అయితే పోలీసు నిఘా చాలా తక్కువగా ఉంటుందని వ్యభిచార ముఠాలు ఈ ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు తెలిసింది. డబ్బులకు అలవాటుపడి కొంతమంది యువతులు ఈ రొంపిలోకి దిగుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని హోటళ్లు, లాడ్జిలలో తరచు వ్యభిచారం కేసులు నమోదవుతున్నాయి.