neelam ramesh
-
ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటాం
వినాయక్‌నగర్: ఎంత మంది వెళ్లినా తాము మాత్రం వైఎస్సార్సీపీలోనే ఉంటామని, పార్టీ బలోపేతానికి కషి చేస్తామని సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి ఇన్చార్జి నీలం రమేశ్ తెలిపారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన మంగళవారం కలిసి, మాట్లాడారు. తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీనీ వీడడం బాధాకరమని, ఎవరూ వెళ్లినా తాము మాత్రం పార్టీలోనే ఉంటామని తెలిపారు. సేవాదళ్ కార్యకర్తలంతా ప్రజల్లో ఉంటూ పార్టీ పటిష్టతకు కషి చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అమలు చేసిన పథకాలను గుర్తు చేస్తూ వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. సేవాదళ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు -
తమ్ముడినే చంపేశాడు
నల్గొండ: ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేశాడు ఓ అన్న. ఈ సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మడమడక గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. మడమడక గ్రామ పంచాయతీ పరిధిలోని షాకెల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు నీలం నిరంజన్(28), నీలం రమేష్(22)లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలతో వారి మధ్య కొద్ది రోజులుగా వచ్చిన మనస్ఫర్థలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున రమేష్ నిద్రిస్తున్న సమయంలో నిరంజన్ రోకలిబండతో అతని పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.