ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే ఉంటాం | neelam ramesh meets YS Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే ఉంటాం

Published Wed, May 4 2016 3:34 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే ఉంటాం - Sakshi

ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే ఉంటాం

వినాయక్‌నగర్‌: ఎంత మంది వెళ్లినా తాము మాత్రం వైఎస్సార్‌సీపీలోనే ఉంటామని, పార్టీ బలోపేతానికి కషి చేస్తామని సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి ఇన్‌చార్జి నీలం రమేశ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన మంగళవారం కలిసి, మాట్లాడారు. తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీనీ వీడడం బాధాకరమని, ఎవరూ వెళ్లినా తాము మాత్రం పార్టీలోనే ఉంటామని తెలిపారు.

సేవాదళ్‌ కార్యకర్తలంతా ప్రజల్లో ఉంటూ పార్టీ పటిష్టతకు కషి చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అమలు చేసిన పథకాలను గుర్తు చేస్తూ వైఎస్సార్‌సీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. సేవాదళ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement