‘టాప్స్’ నుంచి నీరజ్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: ఇటీవల డోపింగ్ పరీక్షలో విఫలం అయిన భారత మహిళా బాక్సర్ నీరజ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒలింపిక్స్‌లో భారత్ పతకం సాధించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం’ (టాప్స్) నుంచి ఆమె పేరును తొలగించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. నీరజ్‌తో పాటు భారత షూటర్లు రవి కుమార్, ఓం ప్రకాశ్‌లు కూడా ‘టాప్స్’ నుంచి ఉద్వాసనకు గురయ్యారు.