neeraj shyam
-
ఆ స్టార్స్ కోసం స్టోరీలు రెడీ చేస్తున్నా
‘‘నాది అత్తిలి. ఇంటర్ అవగానే యానిమేషన్ నేర్చుకుందామని హైదరాబాద్ వచ్చినప్పుడు దర్శకుడు మారుతితో స్నేహం కుదిరింది. తను దర్శక–నిర్మాతగా మారితే, నేను ఫ్రాన్స్‌లో యానిమేషన్ డెరైక్టర్ అయ్యాను. ఓ మంచి సినిమా తీయాలని ఇక్కడికొచ్చి ‘ఇ ఈ’ తెరకెక్కించా’’ అని దర్శకుడు రామ్ గణపతిరావు అన్నారు. నీరజ్ శ్యామ్, నైరా షా జంటగా ఆయన దర్శకత్వంలో లక్ష్మణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ 22న రిలీజ్ కానుంది. రామ్ గణపతిరావు మాట్లాడుతూ– ‘‘అబ్బాయిలంటే ఇష్టపడని అమ్మాయి, అమ్మాయిలంటే ఇష్టం లేని అబ్బాయి ప్రేమలో పడతారు. ఆ అబ్బాయేమో అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా మారతారు. వారు ఎందుకలా మారారు? అన్నది సస్పెన్స్. వినోదం ఉంది. మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్‌కి ఆడియన్స్ కంటతడిపెట్టుకుంటారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో సినిమాలు చేయాలని కథలు కూడా సిద్ధం చేస్తున్నా’’ అన్నారు. -
మగాడి జీవితం మళ్లీ కోలుకోలేదు
‘నేనెప్పుడూ ఏ అమ్మాయిని లవ్ చేయలేదు. ఎవరినీ ఇష్టపడలేదు. అమ్మాయిలంటే నాకు మంచి ఒపీనియన్ కూడా లేదు. హుద్‌హుద్ వచ్చినప్పుడు విశాఖ కోలుకుందేమో కానీ, మీ ఆడవాళ్ల వల్ల గాయపడిన ఏ మగాడి జీవితం మళ్లీ కోలుకోలేదు... ఆనందంగా ఉంచడమంటే అవసరాలు తీర్చడం కాదు. ఆశలు తీర్చడం’ వంటి డైలాగులు ‘ఇ ఈ’ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నీరజ్ శ్యామ్, నైరా షా జంటగా రామ్ గణపతిరావు దర్శకత్వంలో లక్ష్మణ్‌రావు నిర్మించిన సిన్మా ‘ఇ ఈ’. సీనియర్ నటుడు సుధాకర్ కీలక పాత్రలో నటించారు. ఈ సిన్మా ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘నేనూ, రామ్ స్నేహితులం. యానిమేటింగ్లో కలిసి పనిచేశాం. తనేమో ఫ్రాన్స్ వెళ్లి అదే రంగంలో డెరైక్టర్‌గా ఎదిగాడు. నేను దర్శక, నిర్మాతగా మారా. రామ్ దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి’’ అన్నారు. ‘‘ఇ’ అంటే ఇతడు, ‘ఈ’ అంటే ఈమె అని అర్థం. కథాకథనాలు కొత్త తరహాలో ఉంటాయి’’ అన్నారు దర్శకుడు. ఈ నెల్లోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని లక్ష్మణ్‌రావు తెలిపారు. నీరజ్ శ్యామ్, నైరా షా సంగీత దర్శకుడు కృష్ణ చేతన్ పాల్గొన్నారు. -
‘క్యూ’ప్రేమకు.. చావుకు మూవీ స్టిల్స్