వచ్చే నెల మొదటి వారంలో మారుతి ఎస్-క్రాస్
ముంబై : మారుతి సుజుకీ ప్రీమియం కారు, ఎస్-క్రాస్ వచ్చే నెల మొదటి వారంలో మార్కెట్లోకి రానున్నది. ఎస్-క్రాస్తో ప్రీమియం కార్లనందించడం ప్రారంభిస్తామని మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. ఇలాంటి ప్రీమియం కార్లను నెక్సా బ్రాండ్ అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తామని వివరించారు. ఎస్-క్రాస్ ధర రూ.10 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా.