వాలీబాల్‌లో మహిళల అద్వితీయ ప్రదర్శన
భీమవరం : అంతర్‌జిల్లాల వాలీబాల్æ రాష్ట్ర చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా మహిళా జట్టు ద్వితీయస్థానం కైవసం చేసుకుందని వాలీబాల్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి జి.నారాయణరాజు చెప్పారు. శుక్రవారం ఆయన భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆర్మీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ మూడో అంతర్ జిల్లాల రాష్ట్ర చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయని, వీటిల్లో జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించిందని వివరించారు. జట్టు సభ్యులను నారాయణరాజుతోపాటు అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఎస్.వర్మ, ఉపాధ్యక్షులు డి.ఎస్.రాజు, ఎ.శ్రీధర్, కె.రామరాజు, కోశాధికారి సూర్యనారాయణరాజు, కోచ్‌లు ప్రసాద్, నాయక్ తదితరులు అభిన ందించారు.