ట్రాక్టర్‌పై నెట్ వేయనందుకు జరిమానా
విజయవాడ (భవానీపురం) :
ఘాట్లలో నుంచి చెత్తను తీసుకువెళ్లే ట్రాక్టర్‌పై నెట్ వేయనందుకుగాను కాంట్రాక్టర్‌కు రూ.10వేలు జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ జి. వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పున్నమి, భవానీఘాట్లలో పర్యటించారు. భవానీఘాట్లోని డస్ట్బిన్ల నుంచి సేకరించిన చెత్తను ట్రాక్టర్లో వేసుకుని పైన ఏ విధమైన పట్టాగానీ, నెట్గానీ లేకపోవడాన్ని గమనించిన ఆయన పైవిధంగా స్పందించారు. భక్తులు నదిలో పడేసే పూలు, ఆకులను ఎప్పటికప్పుడు నెట్ల ద్వారా తొలగించేలా చూడాలని ఆదేశించారు.