కొత్త బార్ పాలసీ రెడీ
నిబంధనలు సిద్ధం చేసిన ఎకై ్సజ్ శాఖ
పాతవారికే బార్లు మున్సిపాలిటీలో కొత్తబార్లు వచ్చే అవకాశం
తిరుపతి క్రైం: ఎకై ్సజ్ శాఖ ఎట్టకేలకు నూతన బార్ పాలసీ సిద్ధం చేసింది. పాత బార్ యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ దృష్ట్యా బార్లను పాతవారికే ఇవ్వాలని నిర్ణరుుంచి, కొత్త నిబంధనలు తయారు చేశారు.
మున్సిపాలిటీల్లో కొత్తబార్లు
జిల్లాలో 6 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉన్నారుు. నూతన బార్ పాలసీ వల్ల వీటిలో 7 నుంచి 10 వరకు బార్లు పెరగనున్నారుు. కొత్త వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం జిల్లాలో చిత్తూరు, తిరుపతి పరిధిలో 27 బార్లు ఉన్నారుు. కొత్త నిబంధనలకు అనుగుణంగా బార్ లెసైన్సలను జారీ చేయాలని నిర్ణరుుంచారు. లెసైన్సలు తీసుకోవడానికి ఇష్టపడిన వ్యాపారుల స్థానంలో కొత్తవారికి లాటరీ పద్ధతిలో బార్లు కేటారుుస్తారు. బార్ విస్తీర్ణం 150 నుంచి 200 చదరపు మీటర్లకు పెంచారు. ఆపై పెరిగే ప్రతి 100 చ.మీటర్ల విస్తీర్ణానికి లెసైన్స ఫీజులో 10శాతం అదనంగా చెల్లించాలి. ప్రస్తుతం బార్ యజమానులు కాలపరిమితి వరకు రూ.35 లక్షలు చెల్లిస్తున్నారు. వినియోగదారులు అడిగితే సీసాలు ఓపెన్ చేయకుండా ఇవ్వాలి. పార్కింగ్ స్థలం, కిచెన్ ఉండాలి. లెసైన్స ఫీజు లక్ష నుంచి 4 లక్షలకు పెంచనున్నారు.