New Electric Vehicle Policy
-
కొత్త ఈవీ పాలసీ
న్యూఢిల్లీ: టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం అనుమతి లేఖ ఇచి్చన తేదీ నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కారును (సీబీయూ)ని దిగుమతి చేసుకుంటే.. ఇంజిన్ పరిమాణం, ఖరీదు, బీమా, రవాణా (సీఐఎఫ్) మొదలైనవి కలిపి విలువను బట్టి 70 శాతం నుంచి 100 శాతం దాకా కస్టమ్స్ సుంకాలు ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు, పేరొందిన అంతర్జాతీయ ఈవీల తయారీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడగలదని కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుండటం, అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్ మొదలైనవి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. స్కీముకి సంబంధించి మరిన్ని వివరాలు.. ► ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్ 4 వీలర్ల ఉత్పత్తి కోసం భారత్‌లో కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్ డాలర్ల) పెట్టుబడితో తయారీ ప్లాంటు నెలకొల్పాలి. ► కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోగా ప్లాంటును ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా దేశీయంగా కనీసం 25 శాతం విలువను (డీవీఏ) జోడించాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలి. డీవీఏని 50 శాతానికి పెంచి, కనీసం రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయడం పూర్తయిన తర్వాతే బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వం వాపసు చేస్తుంది. ► తక్కువ సుంకాలతో గరిష్టంగా ఏడాదికి 8,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లను దిగుమతి చేసుకోవచ్చు. వార్షిక పరిమితి కన్నా తక్కువగా దిగుమతి చేసుకుంటే మిగతాది తర్వాత ఏడాదికి క్యారీఫార్వార్డ్ చేసుకునేందుకు వీలుంటుంది. ► స్కీమును నోటిఫై చేసిన సుమారు 120 రోజుల్లో దరఖాస్తులను ఆహా్వనిస్తారు. కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 120 రోజుల్లోగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
పంతం నెగ్గించుకున్న ఎలాన్ మస్క్
కేంద్రం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీపై పనిచేయనుందా? భారత్ ‘మేడిన్ ఇన్ ఇండియా’ నినాదంతో దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా దిగుమతి పన్ను (import taxes) తగ్గిస్తూ కొత్త ఈవీ పాలసీని అమలు చేయనుందా? అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ వెహికల్ పాలసీ ఉండబోతుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. కేంద్రం కసరత్తు చేస్తున్న కొత్త వెహికల్ పాలసీ ఇలా ఉండబోతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం.. దేశీయంగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పాలసీ అమలుతో 15 శాతం పన్ను రాయితీని పొందవచ్చు. అదే కారు ధర 40,000 డాలర్లు కంటే ఎక్కువగా ఉంటే 70 శాతం ట్యాక్స్ కట్టేలా కేంద్రం కొత్త వెహికల్ పాలసీని తయారు చేస్తుందని పలు నివేదికలతో పాటు, వెహికల్ పాలసీతో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు చెప్పారంటూ నివేదికలు పేర్కొన్నాయి. అమెరికా తరహాలో ఉదాహరణకు ..టెస్లా సంస్థ తయారు చేసి, అత్యధికంగా అమ్ముడైన కార్లలో ‘టెస్లా మోడల్ వై’ ఒకటి. ట్యాక్స్ తగ్గక ముందు ఈ కారు ప్రారంభ ధర 47,740 డాలర్లుగా ఉంది. పన్ను రాయితీ పొందిన తర్వాత అదే కారు ధర 47,490 డాలర్లకు అమ్ముతుంది. అలా, అమెరికా ప్రభుత్వం టెస్లా కార్లపై ఎలాంటి రాయితీలు ఇస్తుందో.. అదే తరహాలో భారత్ సైతం తమకు ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కోరుతున్నారు. దీంతో కేంద్రం సైతం సాధ్యసాధ్యాలను పరిగణలోకి తీసుకొని వెహికల్ పాలసీని తీర్చిదిద్దే పనిలో పడింది. కొత్త వెహికల్ పాలసీతో లాభాలు ఒకవేళ ఇదే వెహికల్ పాలసీ అమల్లోకి వస్తే.. భారత్‌లోని పలు కార్ల తయారీ సంస్థలు ఇతర దేశాల్లో తయారైన ఈవీ కార్లను దిగుమతి చేసుకోవడం తగ్గిపోతుంది. స్థానిక ఈవీ వాహనాల ధరల తగ్గుతాయని అంచనా. టెస్లాలాంటి అంతర్జాతీయ కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థలు స్థానికంగా కార్ల తయారీ, అమ్మకాలు నిర్వహించుకునే వెసలుబాటు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ కార్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో 2 శాతం కంటే తక్కువగా ఈవీ కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో వాటి విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పన్ను తగ్గుతుందా? దిగుమతి పన్ను తక్కువగా ఉంటే కొత్త కార్లతో పాటు ఇతర అన్నీ మోడల్ కార్లను అమ్మేందుకు టెస్లాకు అవకాశం లభిస్తుందని మరో నివేదిక హైలెట్ చేసింది. కాగా.. కొత్త ఈవీ వెహికల్ పాలసీపై వాణిజ్య అర్ధిక ఆర్థిక మంత్రిత్వ శాఖలు, టెస్లా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే, ఈ వెహికల్ పాలసీ తయారీ ప్రారంభ దశలో ఉందని.. పూర్తియితే ట్యాక్స్ తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి👉 చంద్రయాన్-3 విజయం, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు?