New Films
-
యంగ్ పొంగల్
పండగంటే ఎవరింటికి వాళ్లు చేరుకోవాలి. థియేటర్లోకి సినిమా రావాలి. కుటుంబమంతా కలసి ఆ సినిమాకు వెళ్లాలి. సినిమాకు సంక్రాంతి ముఖ్యం. సంక్రాంతికి సినిమా ముఖ్యం. సంక్రాంతి బరిలో దిగడానికి భారీ సినిమాలు పోటీపడుతుంటాయి. స్టార్ హీరోలు ఇద్దరు ముగ్గురు పండగ పోటికీ సిద్ధమైతే, యంగ్ హీరోలకు ఛాన్స్ మిస్. కానీ వచ్చే సంక్రాంతి పూర్తిగా యంగ్ కాబోతోంది. ఈ పొంగల్ (సంక్రాంతి)కి వినోదం వడ్డించడానికి యంగ్ హీరోలు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. రంగ్ దే 25 సినిమాలు చేసిన నితిన్‌కు ఇప్పటివరకు ఒక్క సంక్రాంతి రిలీజ్ లేకపోవడం విశేషం. ‘రంగ్ దే’తో తొలిసారి పొంగల్‌కి తన సినిమాను విడుదల చేయబోతున్నారు నితిన్. అలాగే పెళ్లి తర్వాత నితిన్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శర్వాతో శ్రీకారం శర్వానంద్‌కి సంక్రాంతి కలిసొస్తుంది. గతంలో ‘ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి’ సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. శర్వానంద్ కెరీర్లో మంచి హిట్స్‌గా ఈ సినిమాలు నిలబడ్డాయి. ఇప్పుడు ‘శ్రీకారం’తో మరోసారి సంక్రాంతికి థియేటర్స్‌లోకి రాబోతున్నారు. కొత్త దర్శకుడు కిశోర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో శర్వానంద్ రైతుగా కనిపించనున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయిక. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కావాల్సింది. కరోనా వల్ల సంక్రాంతికి వాయిదా వేశారని సమాచారం. బ్యాచిలర్ వస్తున్నాడు అఖిల్‌కి ఇది తొలి సంక్రాంతి. హీరోగా అఖిల్ థియేటర్లో సందడి చేయబోతున్న తొలి సంక్రాంతి. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా సమ్మర్లో విడుదల కావాల్సింది. కరోనా వల్ల పొంగల్‌కి పోస్ట్‌పోన్ అయింది. ఇందులో అఖిల్ పాత్ర పేరు నాగార్జున అని టాక్. ఇదో రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని సమాచారం. కరోనాతో సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. షూటింగులు ఆగిపోయాయి. సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. సినిమా సందడి లేకపోవడం సినీ ప్రేమికులకు పెద్ద లోటు. త్వరలో థియేటర్లు ఆరంభం అయి, సందడి మొదలవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
అరడజను సిద్ధం
మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను అందిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ. ఈ బ్యానర్ నుంచి వచ్చే చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఆ నమ్మకంతోనే డి. సురేశ్‌బాబు దాదాపు 12 చిత్రాలను పైప్‌లైన్‌లో పెట్టారని తెలిసింది. ఇందులో సమంత నటించిన ఓ బేబి, అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’, ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించిన ‘దొరసాని’, శ్రీవిష్ణు, నివేథా ధామస్ నటిస్తున్న ‘బ్రోచేవారెవరురా’, ‘ఫలక్‌నుమాదాస్’, ‘మల్లేశం’ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మంచి రిలీజ్ డేట్స్ చూసి, ఈ చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నారు. -
కొత్త చిత్రాలకు 30 శాతం వినోదపు పన్ను
సాక్షి, టీ.నగర్: కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలోని థియేటర్లలో విడుదలయ్యే కొత్త చిత్రాలకు 30 శాతం వినోదపు పన్ను విధించాలని అసెంబ్లీలో గురువారం మంత్రి ఎస్పీ వేలుమణి ఓ చట్ట సవరణ ముసాయిదాను దాఖలు చేశారు. అందులో తమిళనాడు చలనచిత్ర ప్రతినిధులు, స్థానిక సంస్థలకు వినోదపు పన్ను విధించడంపై ఉన్న వివాదాలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారన్నారు. ఈ వ్యవహారంపై నియమించిన ప్రతినిధులతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. పరిశీలించిన ప్రభుత్వం వినోదపు పన్ను వసూలు చేసేందుకు స్థానిక సంస్థల ద్వారా నియమితులైన అధికారులు పరిశీలన జరిపేలా అనుమతిచ్చే చట్ట ముసాయిదా దాఖలు చేశామన్నారు. ఈ మేరకు కార్పొరేషన్, పట్టణ పంచాయతీ పరిధి లోని థియేటర్లలో 30 శాతం వినోదపు పన్ను చెల్లించాలని, పాత చిత్రాలకు 20 శాతం వినోదపు పన్ను చెల్లించాలని అందులో పేర్కొన్నారు. -
రూ.20కే బోలెడు కొత్త సినిమాలు
క్రిస్మస్ కానుకగా గూగుల్ ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసుల్లో ఓ కొత్త ప్రమోషనల్ ఆఫర్‌ను వినియోగదారులు మందుకు తీసుకొచ్చింది. కేవలం రూ.20కే ప్లే మూవీస్‌లో ఎన్ని కొత్త సినిమాలనైనా చూసే అవకాశం కల్పిస్తోంది. ఆశ్చర్యకరంగా ఇటీవల సూపర్ హిట్ కొట్టిన సినిమాలకు ఈ ఆఫర్‌ను వర్తింపజేస్తోంది. జాసన్ బోర్న్, సూసైడ్ స్క్వాడ్, ఫైండింగ్ డోరి, ది జంగిల్ బుక్, సుల్తాన్, ఎక్స్-మెన్, క్యాప్టైన్ అమెరికా , సివిల్ వార్, జూటోపియా వంటి మూవీలను ఈ ప్రమోషనల్ ఆఫర్లో గూగుల్ ఆఫర్ చేస్తోంది. అయితే క్రిస్మన్, న్యూఇయర్ నేపథ్యంలో తీసుకొస్తున్న ఈ ఆఫర్‌ను, ఆ రోజే సినిమాలు చూడాలని ఏమీ లేదట. ఈ ఆఫర్‌ను 2017 జనవరి 23 వరకు అందుబాటులో ఉంచుతున్నట్టు గూగుల్ తెలిపింది. వచ్చే నెల నుంచి టన్నుల కొద్ది కొత్త సినిమాలను రూ.20కే చూసే అవకాశం కల్పిస్తోంది.