రూ.20కే బోలెడు కొత్త సినిమాలు
రూ.20కే బోలెడు కొత్త సినిమాలు
Published Sat, Dec 24 2016 1:05 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
క్రిస్మస్ కానుకగా గూగుల్ ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసుల్లో ఓ కొత్త ప్రమోషనల్ ఆఫర్ను వినియోగదారులు మందుకు తీసుకొచ్చింది. కేవలం రూ.20కే ప్లే మూవీస్లో ఎన్ని కొత్త సినిమాలనైనా చూసే అవకాశం కల్పిస్తోంది. ఆశ్చర్యకరంగా ఇటీవల సూపర్ హిట్ కొట్టిన సినిమాలకు ఈ ఆఫర్ను వర్తింపజేస్తోంది. జాసన్ బోర్న్, సూసైడ్ స్క్వాడ్, ఫైండింగ్ డోరి, ది జంగిల్ బుక్, సుల్తాన్, ఎక్స్-మెన్, క్యాప్టైన్ అమెరికా , సివిల్ వార్, జూటోపియా వంటి మూవీలను ఈ ప్రమోషనల్ ఆఫర్లో గూగుల్ ఆఫర్ చేస్తోంది.
అయితే క్రిస్మన్, న్యూఇయర్ నేపథ్యంలో తీసుకొస్తున్న ఈ ఆఫర్ను, ఆ రోజే సినిమాలు చూడాలని ఏమీ లేదట. ఈ ఆఫర్ను 2017 జనవరి 23 వరకు అందుబాటులో ఉంచుతున్నట్టు గూగుల్ తెలిపింది. వచ్చే నెల నుంచి టన్నుల కొద్ది కొత్త సినిమాలను రూ.20కే చూసే అవకాశం కల్పిస్తోంది.
Advertisement
Advertisement