కొత్త.. న్యూ.. నయా..
వర్షమొస్తే చాలు తుమ్ములు ఆగని కోతి.. నాలుగు రోజులైనా నేలపై బతకగలిగే చేప.. ఇలాంటివెన్నో కొత్త వృక్ష, జీవజాతులను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్)కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. అది కూడా మన ఉత్తర హియాలయాల్లోనే.. 2009-14 మధ్య నేపాల్, మయన్మార్, భూటాన్, ఈశాన్య భారత్లో తాము సాగించిన అన్వేషణలో 211 కొత్త జాతులను కనుగొన్నట్లు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తెలిపింది.
పైకి తిరిగినట్లుండే ముక్కు ఉన్న ఈ కోతికి వర్షాకాలమొస్తే.. తుమ్ములు ఆగవట. దానికి కారణం దాని ముక్కున్న తీరే.. పైకి ఉన్నట్లు ఉండటం వల్ల నీళ్లు ముక్కులోకి చేరడం.. తుమ్ములు రావడం కామనే కదా.. ఇక నీలి రంగులో ఉన్న ఈ చేపలు నీళ్లు లేకున్నా.. నేలపై నాలుగు రోజుల వరకూ బతికి ఉండగలవట. అంతేకాదు.. అలా పాక్కుంటూ పాక్కుంటూ పావు కిలోమీటరు దాకా ఇవి వెళ్లగలవట!