‘హెచ్ఆర్డీకి ప్రతిపాదనలు పంపాం’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో సవరణలు, సూచనలను ప్రతిపాదిస్తూ కేంద్ర మానవవనరుల శాఖకు ప్రతి పాదనలు పంపినట్లు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. సమాజంలో వివక్షల తొలగింపునకు, ఉద్యోగాల కల్పనకు, ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన విద్యే కీలకమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్న నాణ్యమైన విద్యను అందించడం, భారత్‌ను గొప్ప విద్యాశక్తిగా తీర్చదిద్దడం వంటి అంశాల ప్రాతిపదికగా సూచనలు రూపొందించినట్లు ఆయన తెలియజేశారు.