niagara water falls
-
గడ్డకట్టిన నయాగరా జలపాతం.. అద్భుత దృశ్యాలు
న్యూయార్క్: అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరుగనటువంటి చలి గాలులు, విపరీతంగా కురుస్తోన్న మంచు ధాటికి దేశమంతా అతలాకుతలమైంది. 4వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా 60 మందికిపైగా మరణించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ముఖ్యంగా న్యూయార్క్, బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చిత్రాలు, వీడియోలు చూపుతున్నాయి. బఫెలో కౌంటీలో వాహనాల్లోనే గడ్డకట్టుకుపోయి మరణించిన సంఘటనలూ ఉన్నాయి. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే, నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నయాగరా ఫాల్స్ న్యూయార్క్ స్టేట్ పార్క్ ప్రకారం ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు జలపాతం నుంచి పడుతుంది. ఈ నీరు ప్రతి సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జ్‌పై నడవటాన్ని నిషేధించారు. 1912, ఫిబ్రవరి 4 నయాగరా నదిపై ఏర్పడిన మంచు వంతెనపైకి వెళ్లి ముగ్గురు చనిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. The day after the great freeze, my family and I went to #NiagraFalls. The #NiagraRiver below it had ice thick enough for you *to technically* get to #Buffalo, #NewYork by foot! Was it an intriguing and surreal Arctic experience for a kid from California, yes! pic.twitter.com/MAC8IIfjZc — Escondido Weather Observer (CoCoRaHs: CA-SD-197) (@KCAESCON230) December 23, 2022 ఇదీ చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం -
బొగత... మన నయాగరా...కిషన్ రెడ్డి
ప్రస్తుతం వానలు కురుస్తున్న నేపథ్యంలో బొగత జలపాతం పర్యాటకులకు మరోసారి సందర్శనీయ ప్రదేశం గా మారింది. కనువిందు చేసే బొగత అందాలను సందర్శించాలంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కూ యాప్ పై తన అభిప్రాయం పంచుకున్నారు..."తెలంగాణ "నయాగర"గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా,వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది. ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని" ఆయన కోరారు. Koo App తెలంగాణ "నయాగర"గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా,వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది.ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని కోరుతున్నాను. View attached media content - Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 29 June 2022 -
నయాగార గడ్డకట్టింది..!
-
మంచుకొండ కాదు.. నయాగారా!
నయాగారా జలపాతం గడ్డకట్టుకుపోయింది. ఎప్పుడూ ప్రవహించే నీళ్లతో కళకళలాడుతుండే ఈ జలపాతాలు ఉన్నట్టుండి మంచు కొండల్లా మారిపోయాయి. దాంతో దీన్ని చూసేందుకు పర్యాటకులు వెల్లువెత్తుతున్నారు. ఈ జలపాతాల్లో అమెరికా వైపు ఉండే ప్రాంతమంతా బాగా చలి ఉండటంతో అక్కడ నీళ్లన్నవి కనపడకుండా మొత్తం మంచుకొండల్లా మారిపోయింది. అమెరికా, కెనడా ప్రాంతాల్లో చాలావరకు విపరీతమైన చలి ఉంటోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలి కూడా బాగా చల్లగా ఉండటంతో చలి ఎముకలు కొరికే స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పర్యాటకులు కెమెరాలు పట్టుకుని గడ్డకట్టుకుపోయిన జలపాతాన్ని దృశ్యరూపంలో బంధించేందుకు పోటీలు పడుతున్నారు. మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి