రేప్ కేసులో కేంద్రమంత్రికి కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ లో ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. రేప్ కేసులో కేంద్రమంత్రి నిహాల్చంద్కు కోర్టు సమన్లు జారీ చేసింది. తాజా కేంద్రమంత్రివర్గంలో ఓ మంత్రిని కోర్టు తప్పుపట్టడం తొలి సంఘటన నమోదైంది.
ఈ వ్యవహారంపై ప్రధాని ఏవిధంగా స్పందిస్తారోనని మీడియా, రాజకీయవర్గాలు వేచి చూస్తున్నాయి. కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ప్రధాని మోడీని కేంద్ర మంత్రి నిహాల్చంద్ భేటి అయ్యారు. ఐతే నిహాల్ చంద్ రాజీనామా చేసే అవకాశం ఉందని దేశరాజధానిలో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
తన భర్త, ప్రస్తుత కేంద్రమంత్రి నిహాల్ చంద్ తోపాటు అతని స్నేహితులు తనను లైంగిక వేధించారని జైపూర్ లోని వైశాలీ నగర్ కు చెందిన ఓ మహిళ కోర్టు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కోర్టు 17 మందితోపాటు కేంద్రమంత్రికి సమన్లు జారీ చేసింది.