మళ్లీ అలాంటి నిర్ణయమే తీసుకున్న అమెరికా
వాషింగ్టన్: గతంలో తీసుకున్న నిర్ణయమే భారత్‌ను కలవరపెడుతుండగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక దాడులకు ఉపయోగించే ఏహెచ్-1జెడ్ వైపర్ హెలికాప్టర్లను పాకిస్థాన్‌కు విక్రయించనుంది. మొత్తం తొమ్మిది ఈ తరహా హెలికాప్టర్లను పాక్ కు విక్రయించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు పెంటగాన్ అధికారులు చెప్పారు.
ఇప్పటికే ఫైటర్ జెట్ ఎఫ్-16 విమానాలను పాక్ విక్రయించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న నిర్ణయం భారత్‌కు మింగుడు పడకముందే తాజా నిర్ణయం మరోసారి ఆలోచనలో పడేసినట్లయింది. పాక్ విక్రయించనున్న ఈ హెలికాప్టర్ల ధర కనీసం 170 మిలియన్లు ఉండనుంది.