ninja fighter
-
కత్తులు తయారు చేస్తున్న టెక్ బాస్.. వీడియో వైరల్!
Mark Zuckerberg viral video: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం, ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కత్తుల తయారీపై దృష్టి పెట్టినట్లు ఉన్నారు. ఇటీవల జపనీస్ కత్తి మాస్టర్ అకిహిరా కోకాజీ నుంచి కత్తి తయారీ పాఠాన్ని నేర్చుకున్నారు. పదునుకు ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ జపనీస్ కత్తి ‘కటనా’ను తయారు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జుకర్‌బర్గ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్ట్‌లను షేర్ చేశారు. అందులో ఆయన కత్తి మాస్టర్‌తో పోజులివ్వడాన్ని చూడవచ్చు. మరొక చిత్రంలో తాను తయారు చేసిన కత్తిని చూపించాడు. అలాగే కత్తి తయారు చేస్తున్న వీడియోను, తయారు చేసిన కత్తిని వాడుతున్న వీడియోను కూడా షేర్ చేశారు. "మాస్టర్ అకిహిరా కోకాజీతో కటనాల తయారీ గురించి నేర్చుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. మీ (అకిహిరా కోకాజీ) కళా నైపుణ్యాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!" అని పేర్కొన్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. షేర్ చేసినప్పటి నుంచి 3.6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి. “తయారు చేసిన కటానాను మీతోనే ఉంచుకుంటారా?” అని ఓ యూజర్ ప్రశ్నించారు. “మీరు నిజమైన నింజాగా మారే మార్గంలో ఉన్నారు. చేతులతో యుద్ధంలో ఆరితేరాక కత్తులపై దృష్టిపెట్టారు!” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
పాము తలపై రెండు కిక్‌లు.. అంతే..!
-
వైరల్ : అత్యంత విషపూరితం.. అయినా సురక్షితం..!
వాషింగ్టన్ : అమెరికా ఎడారుల్లో అత్యంత విషపూరితమైన రాటిల్‌స్నేక్ దాడుల నుంచి ప్రాణాలు నిలుపుకొంటున్న కంగారూ ర్యాట్ వ్యూహాలేమిటో తెలిసిపోయాయి. రాటిల్‌స్నేక్ నోటికి చిక్కినా కూడా సరికొత్త వ్యూహాలతో తప్పించుకుంటున్న ఈ ఎలుకల చాకచక్యాన్ని చూసి జంతు శాస్త్రవేత్తలే ఆశ్యర్యపోయారు. సెకన్లో ఏడో వంతు వేగంతో పాము తలపై ఎగిరి తంతున్న కంగారూ ర్యాట్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధునాతన కెమెరాలు, పరికరాలతో అరిజోనా ఎడారిలో శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు. అంతెత్తున ఎగిరి.. శాస్త్రవేత్త ఫ్రేమిలర్ ప్రకారం.. ఇసుకలో కూడా అతి వేగంగా కదిలే అత్యంత ప్రమాదకరమైన సర్పం రాటిల్‌స్నేక్. అయినా, వాటికి ఆహారం కాకుండా ఎస్కేప్ అవుతున్న కంగారూ ర్యాట్ ఆత్మరక్షణా యుక్తులు అద్భుతం. అందరూ అనుకుంటున్నట్టుగా ఇవి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడటం లేదు. విస్మయపరిచే వ్యూహాలతో పాములకే సవాల్ విసురుతున్నాయి. తాజా వీడియోలో.. ఎలుకను విందు చేసుకుందామనుకున్న రాటిల్‌స్నేక్ దానిమీదకి ఒక్క ఉదుటున దుమికింది. నోట కరుచుకున్నంత పని చేసింది. అయితే, పాముకన్నా వేగంగా స్పందించిన ఎలుక అంతెత్తున గాల్లోకి ఎగిరింది. పాము నోట్లో చిక్కుకుంది అనుకునే సమయంలో నింజాఫైట్ చేసింది. దాని తలపై రెండు కాళ్లతో కిక్ చేసింది. మళ్లీ గాల్లోనే గింగిరాలు తిరుగుతూ.. పాముకు అందకుండా దూరంగా పారిపోయింది. ఆ పరిస్థితుల్లో వేరే జాతికి చెందిన ఎలుకలుంటే వాటికి చావు తథ్యం అయ్యేదే. మామూలుగా అయితే, రాటిల్‌స్నేక్ చాలా వేగంగా దెబ్బకొడతాయి. కానీ, కంగారూ ర్యాట్స్ మరింత వేగంగా స్పందింస్తాయి. ఈ ఎలుకలు పరుగెత్తడానికి వీలు లేనప్పుడు నింజాఫైట్ ట్రిక్కులతో బయటపడతాయి. అయితే, పాము విషం చిమ్మితే ఎలుక ప్రాణాలు ఉంటాయా అనే ఒక సందేహం కలుగుతోంది కదా.. వేగంగా స్పందించినప్పుడు సరిపడినంత విషం పాము కోరల్లోకి రాదు. ఆ క్రమంలో కంగారూ ర్యాట్స్ ఫైట్ చేసి తప్పించుకుంటాయి. ఎలుకలు 30 నుంచి 70 మిల్లీ సెకన్లపాటు పాము నోట్లో ఉన్నా కూడా వాటికి విషం చేరదు. అంటే మనిషి కనురెప్పపాటు కాలం (150 మిల్లీ సెకండ్లు) కన్నా తక్కువ సమయంలో ఎలుక యుద్ధం చేసి విజయం సాధిస్తుందన్నమాట..! -
కరాటే నేర్చిన ఉడత.. ఏం చేసిందో తెలుసా?
ఓ గద్ద మంచి ఆకలి మీద ఉంది.. గాలిలో ఎగురుతూ తనకు ఆహారం ఏం దొరుకుతుందా అని చూస్తోంది.. ఇంతలో కింద చెట్టుమీద దానికి ఓ మంచి ఉడత కనిపించింది. హమ్మయ్య.. ఈ రోజుకు లంచ్ దొరికేసిందని సంబరపడుతూ, తీక్షణంగా దానికేసి చూసి... తన పదునైన ముక్కును ఓసారి సరిచేసుకుని నేరుగా కిందకు రాసాగింది. మామూలుగా అయితే, ఆ ఉడత దానికి ఆహారం అయిపోవాల్సిందే. ఆరోజుతో దానికి భూమ్మీద నూకలు చెల్లిపోవాల్సిందే. కానీ, అది అలాంటి ఇలాంటి ఉడత కాదు.. ఎక్కడ చూసిందో గానీ అది మార్షల్ ఆర్ట్స్ బాగా నేర్చుకుంది. గద్ద వస్తుండటం చూసి ఒక్కసారిగా నింజా ఫైటర్ల లెవెల్లో గాల్లోకి ఎగిరి, అక్కడి నుంచి సులభంగా తప్పించుకుంది!! కింద ఉడత ఉందని సంబరంగా దూకిన గద్ద కాస్తా నేలకు గుద్దుకుంది. ఈ ఘటన అమెరికాలోని జెర్సీ నగరంలో జరిగింది. మొదట ఓ చెట్టు కొమ్మ మీద ఉన్న ఉడతను చూసి గద్ద చాలా హ్యాపీగా ఫీలయింది. కానీ చేతిదాకా వచ్చి నోటి కాడికి రాకుండా పోయినట్లు కావడంతో గద్ద ఉసూరుమంది.