Nisar Ahmed Kakru
-
జస్టిస్ కక్రూను వెంటనే తొలగించాలి
తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: విధులకు హాజరు కాకుండానే జీత భత్యాలు, ఇతర సౌకర్యాలను అనుభవిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూను వెంటనే తొలగించాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఉన్నత పదవిలో ఉన్నా అనైతికంగా ప్రవర్తిస్తున్నారని, చైర్మన్‌గా ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదని మండిపడింది. సంఘం అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ నేతృత్వంలో న్యాయవాదులు గురువారం కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
హెచ్ఆర్సి చైర్మన్‌పై కేంద్రానికి ఫిర్యాదు
-
హెచ్ఆర్సి చైర్మన్‌పై కేంద్రానికి ఫిర్యాదు
హైదరాబాద్: రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సి) చైర్మన్ నిసార్ అహ్మద్ కక్రూపై న్యాయవాది అజయ్ కేంద్ర హొం శాఖకు ఫిర్యాదు చేశారు. కక్రూ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అజయ్ ఫిర్యాదుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నివేదిక సమర్పించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. **