Nischinda police station
-
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం: నిందితుడు అరెస్ట్
నగరంలోని నిశ్చిందా ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అరుణ్ అగర్వాల్ (38)ను శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు హౌరాలో వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకర్ల సమావేశంలో వివరాలను తెలిపారు. ఈ నెల 5వ తేదీన అరుణ్ తన ఇంటికి ఎదురుగా నివాసిస్తున్న ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ విషయం ఎవరికైన వెల్లడిస్తే చిన్నారిని చంపుతానని బెదిరించాడు. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులను హతమారుస్తానని ఆ చిన్నారిని హెచ్చరించాడు. దీంతో ఆ చిన్నారి తీవ్ర భయాందోళనకు గురైంది. ఈ క్రమంలో ఆ చిన్నారి తీవ్ర అనారోగ్యానికి లోనైంది. దీంతో ఆ పాప తల్లితండ్రులు హుటాహుటిన హౌరాలోని ఆసుపత్రికి తరలించారు. పాపపై అత్యాచారం జరిగిందని వైద్యులు ఆ పాప తల్లితండ్రులకు వెల్లడించారు. దాంతో అసలు జరిగిన విషయాన్ని ఆ చిన్నారి తల్లితండ్రులకు తెలియజేసింది. దాంతో ఆగ్రహాం చెందని ఆ చిన్నారి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అత్యాచార నిందితుడు అరుణ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. తమ విచారణలో చేసిన తప్పును అరుణ్ ఒప్పుకున్నాడని పోలీసులు వివరించారు. -
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం: నిందితుడు అరెస్ట్
నగరంలోని నిశ్చిందా ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అరుణ్ అగర్వాల్ (38)ను శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు హౌరాలో వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకర్ల సమావేశంలో వివరాలను తెలిపారు. ఈ నెల 5వ తేదీన అరుణ్ తన ఇంటికి ఎదురుగా నివాసిస్తున్న ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ విషయం ఎవరికైన వెల్లడిస్తే చిన్నారిని చంపుతానని బెదిరించాడు. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులను హతమారుస్తానని ఆ చిన్నారిని హెచ్చరించాడు. దీంతో ఆ చిన్నారి తీవ్ర భయాందోళనకు గురైంది. ఈ క్రమంలో ఆ చిన్నారి తీవ్ర అనారోగ్యానికి లోనైంది. దీంతో ఆ పాప తల్లితండ్రులు హుటాహుటిన హౌరాలోని ఆసుపత్రికి తరలించారు. పాపపై అత్యాచారం జరిగిందని వైద్యులు ఆ పాప తల్లితండ్రులకు వెల్లడించారు. దాంతో అసలు జరిగిన విషయాన్ని ఆ చిన్నారి తల్లితండ్రులకు తెలియజేసింది. దాంతో ఆగ్రహాం చెందని ఆ చిన్నారి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అత్యాచార నిందితుడు అరుణ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. తమ విచారణలో చేసిన తప్పును అరుణ్ ఒప్పుకున్నాడని పోలీసులు వివరించారు.