Nitin Tiwari
-
రాముడిగా మహేశ్.. రావణుడి పాత్రలో హృతిక్..?
మహేశ్‌బాబు అభిమానులకు ఓ త్రిబుల్ ధమాకా వార్త. ఆ విశేషాలేంటంటే... రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ సినిమా కథాంశం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్‌గా ఉండనుందట. ఆఫ్రికన్ అడవుల్లో చిత్రీకరణ జరిపే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను లాక్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. 2022లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చు. రాముడిగా మహేశ్? రామాయణ ఇతివృత్తం ఆధారంగా హిందీలో భారీ బడ్జెట్‌తో అల్లు అరవింద్, మధు మంతెన ఓ సినిమా నిర్మించనున్నారు. ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారీ, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో మహేశ్ కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రావణుడి పాత్రలో హిందీ నటుడు హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకోన్ కనిపిస్తారట. మూడు భాగాలుగా ఈ సినిమాను సుమారు 1500 వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఎప్పటికీ ఇలానే ఉందాం మహేశ్ బాబు, నమ్రతకు పెళ్లయి బుధవారానికి 16 సంవత్సరాలు నిండాయి. 2005, ఫిబ్రవరి 10న ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 16వ వెడ్డింగ్ యానివర్సరీను దుబాయ్‌లో జరుపుకుంది ఈ జంట. ‘‘హ్యాపీ 16 నమ్రత. ఎప్పటికీ ఇలానే ఉందాం’’ అంటూ ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు మహేశ్. ‘‘ప్రేమ, నమ్మకం, విశ్వాసం– ఈ మూడూ మా అద్భుతమైన ప్రయాణానికి రెసిపీ’’ అన్నారు నమ్రత. -
దళిత బాలికపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం మధుర: ఉత్తరప్రదేశ్‌లో ఓ దళిత బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ నేరం ఆలస్యంగా వెలుగు చూసింది. మధుర జిల్లా పింగ్రి గ్రామంలో శనివారం రాత్రి ఓ ఆలయంలో జరిగిన ఉత్సవానికి బాలిక వెళ్లింది. అదే రాత్రి బహిర్భూమికి వెళ్లగా ఆమెను ఆరుగురు యువకులు అపహరించి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లారు. ఆ భయంతో ఇంటికి వెళ్లిన బాలిక మర్నాడు కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని వివరించింది. దానిపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అత్యాచారానికి పాల్పడిన నిందితులు మనోజ్, మహేష్, గుడ్డు, సన్నో, రామ్‌వీర్, శేఖర్‌గా గుర్తించినట్లు పోలీసు అధికారి నితిన్ తివారీ సోమవారం మీడియాకు తెలిపారు. మహేశ్ తప్ప మిగతా అందరినీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ బదిలీ బెంగళూరు: బెంగళూరులోని ఓ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచార ఘటనపై నిరసనలతో కర్ణాటక ప్రభుత్వంలో చలనం వచ్చింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌పై ప్రభుత్వం సోమవారం బదిలీ వేటు వేసింది. ప్రధాన నిందితుడైన స్కేటింగ్ శిక్షకుడు ముస్తఫా(31)పై గూండా చట్టం ప్రయోగించాలని నిర్ణయించింది. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందన్న విమర్శల నేపథ్యంలో తాజా నిర్ణయాలు వెలువడ్డాయి. మరోవైపు ఈ ఘటనపై నిరసనలు సోమవారం హింసాత్మక రూపం దాల్చాయి.