సబ్ కమిటీ రద్దు
బోధన్ టౌన్, న్యూస్‌లైన్ : బోధన్ పట్టణంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి సబ్ కమిటీని వేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకో ర్టు కొట్టివేసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం చల్లా కోదండ రామ్‌రెడ్డి, నర్సింహారెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదే శాలు (ఉత్తర్వు నెంబర్ 5/ 2014) జారీ చేసింది.ఎన్డీఎస్ఎల్ ప్రైవేటీకరణపై తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రభుత్వం ఎ లాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించిం ది. దీంతో శక్కర్‌నగర్‌లో కార్మిక నాయకులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎఫ్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడి మాట్లాడుతూ కార్మికుల, రైతుల జీవితాలను కాపాడాలని కోరుతూ ఉదయం హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేశామని సాయంత్రం కోర్టు తీర్పును వెల్లడించిందని అన్నారు. 13 డిసెంబర్ 2013న ప్రభుత్వం ఎన్డీఎస్ఎల్ ప్రైవేటీకరణ విషయమై తెలంగాణ, ఆంధ్ర ప్రాంత మంత్రులతో సబ్ కమిటీ వేసిందని, దానిని రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదన్నారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన వారిలో రైతు నాయకులు అజయ్ వడియార్, మెదక్‌కు చెందిన నాగిరెడ్డి, మెట్‌పల్లికి చెందిన సీడీసీ మాజీ చెర్మైన్ బుచ్చి రెడ్డిలు ఉన్నారని తెలిపారు.