ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదు
నెల్లూరు సిటీ: కార్పొరేషన్ పరిధిలో ముఖ్యమైన అంశాల్లో మేయర్ అజీజ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కౌన్సిల్లో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం దారుణమని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. మద్రాస్ బస్టాండ్ ప్రాంతంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపోరుబాటలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అనే విషయాన్ని మేయర్ విస్మరించారని మండిపడ్డారు. చంద్రశేఖర్‌రెడ్డి, సంగం షఫీ, సూర్యనారాయణ, సురేష్, నవీన్, సుధ, తదితరులు పాల్గొన్నారు.