వాళ్లు ఇక చెరో బ్యాండ్ వాయించుకుంటారట
లండన్: ఇంగ్లిష్ రాక్‌స్టార్ బ్యాండ్ నోవా అండ్ వేల్ ఇప్పుడు విడిపోబోతున్నారు. తాము చెరొక బ్యాండ్‌ను స్థాపించబోతున్నామని, వ్యక్తిగత ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. గత ఎనిమిదేళ్లుగా నోవా, వేల్ కలిసి బ్యాండ్ సేవలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా ఫేస్బుక్ ద్వారా ప్రకటించింది. తాము ఎనిమిదేళ్లుగా కలిసి పనిచేస్తూ అందరి అభిమానాలు పొందగలిగామని, ఇన్నాళ్లు తమను ఆధరించినట్లుగానే, ఇప్పుడు విడివిడిగా ప్రత్యేక బ్యాండ్ ఏర్పాటుచేసుకుంటున్న తమను కూడా ఆధారించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
అభిమానుల వల్లే తాము ఎన్నో కష్టాలను అధిగమించి వారి అంచనాలను అందుకున్నామని, వారిని అలరించామని పేర్కొన్నారు. ఇన్నాళ్లపాటు తమకు అభిమానులు అందించిన మద్ధతు మరువలేనిదంటూ ఆనందం వ్యక్తం చేశారు. నోవా, వేల్ బ్యాండ్ నాలుగు స్టూడియో ఆల్బమ్స్‌ను కూడా విడుదల చేసింది. అవి పీస్‌పుల్, ది వరల్డ్ లేస్ మి డౌన్ (2008), ది ఫస్ట్ డేస్ ఆఫ్ స్ప్రింగ్ (2009), లాస్ట్ నైట్ ఆన్ ఎర్త్ (2011), హార్ట్ ఆఫ్ నోహియర్(2013).