nobel committe
-
Nobel Prize 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
స్టాక్హోమ్: ఆయా రంగాల్లోని ప్రజ్ఞావంతులకు నోబెల్ పురస్కారాలను అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో 2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, ఎల్'హ్యులియర్లకు 'ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్'పై చేసిన విస్తృత పరిశోధనలకుగాను వీరిని నోబెల్ బహుమతి వరించింది. BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Physics to Pierre Agostini, Ferenc Krausz and Anne L’Huillier “for experimental methods that generate attosecond pulses of light for the study of electron dynamics in matter.” pic.twitter.com/6sPjl1FFzv — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులకు నోబెల్ అవార్డులను ప్రకటించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా మొదట వైద్య రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించింది కమిటీ. ఈరోజు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు పేర్లను ప్రకటించారు. కాగా ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించడం విశేషం. వీరు ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్లను అధ్యయనం చేసేందుకు అట్టోసెకెండ్ పల్సెస్ డెవలప్మెంట్పై చేసిన ప్రయోగాలకుగాను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2023 physics laureate Pierre Agostini succeeded in producing and investigating a series of consecutive light pulses, in which each pulse lasted just 250 attoseconds. At the same time, his 2023 co-laureate Ferenc Krausz was working with another type of experiment, one that made it… pic.twitter.com/pEFAM0ErNP — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 వీరిలో ఎల్'హ్యులియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఐదవ మహిళగా ఘనత సాధించారు. 1903లో మేరీ క్యురీ, 1963లో మరియా గొప్పెర్ట్-మేయర్, 2018లో డొన్నా స్ట్రిక్లాండ్, 2020లో ఘెజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను సాధించగా 2023 సంవత్సరానికి గాను హ్యులియర్ ఈ పురస్కారాన్ని సాధించి చరిత్రలో చోటు సంపాదించారు. Electrons’ movements in atoms and molecules are so rapid that they are measured in attoseconds. An attosecond is to one second as one second is to the age of the universe.#NobelPrize pic.twitter.com/5Bg9iSX5eM — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 This year’s #NobelPrize laureate in physics Anne L’Huillier discovered that many different overtones of light arose when she transmitted infrared laser light through a noble gas. Each overtone is a light wave with a given number of cycles for each cycle in the laser light. They… pic.twitter.com/bJWD4kiE5Z — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించనుంది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇది కూడా చదవండి: పాక్లో జోరుగా కిడ్నీల దోపిడీ.. 328 సర్జరీలు..? -
‘కేరళ మత్స్యకారులకు నోబెల్ ఇవ్వండి’
-
గాంధీజీకి ఎందుకు రాలేదు?
స్టాక్ హోమ్: నోబెల్ శాంతి బహుమతి. ప్రపంచశాంతికి కృషి చేసిన ఎందరికో ఈ బహుమతిని ప్రదానం చేశారు. మరి భారత్, ఆఫ్రికా దేశాల్లో శాంతియుత పోరాటాలు చేసిన జాతిపిత, మహాత్మగాంధీని ఈ బహుమతిని ఎందుకు వరించలేదు?. ఈ ప్రశ్నే గాంధీ జయంతి(అక్టోబర్ 2న) సందర్భంగా కోట్లాది మంది భారతీయులను తొలుస్తోంది. నార్వే దేశస్తుడైన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1901లో ఈ బహుమతుల ప్రధానాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రపంచశాంతి కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తులకు, వివిధ రంగాల్లో మానవవాళి అభివృద్ధికి కొత్త ఆవిష్కరణలు చేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. ఒక్కసారి నోబెల్ బహుమతిని ప్రదానం చేసిన తర్వాత తిరిగి వెనక్కు తీసుకోరు. అందుకే బహుమతికి ఎంపిక చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మహాత్మగాంధీకి ఎందుకు రాలేదు మహాత్మగాంధీ. శాంతి యుతంగా పోరాటాలను జరిపిన ప్రజానాయకుడు. ఐదు కంటే ఎక్కువసార్లు మహాత్మాగాంధీ పేరు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. అయినా ఆయన గెలవలేదు. భారత్, ఆఫ్రికా దేశాల్లో శాంతియుత పోరాటాలు చేసి తెల్లవారి మెడలు వంచిన శాంతి మూర్తికి గౌరవం దక్కలేదు. అయితే, చాలా అరుదుగా తమ తప్పును గుర్తించే నోబెల్ కమిటీ గాంధీజికి శాంతి బహుమతిని ప్రదానం చేయకపోవడం తాము చేసిన పొరపాటుని ఒప్పుకుంది. 1989లో నోబెల్ కమిటీ చైర్మన్ గాంధీజికి నివాళులు అర్పించి దలైలామాను నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు వారాల్లో నోబెల్ శాంతి బహుమతులను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా నోబెల్ కమిటీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒకసారి పరిశీలిద్దాం. 1. యుద్ధంలో సహకరించిన వ్యక్తికి శాంతి పురస్కారం జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హాబర్ 1918లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. నత్రజని(నైట్రోజన్), ఉదజని(హైడ్రోజన్) వాయువుల నుంచి మూత్రలవణము(అమ్మోనియా)ను తయారుచేసినందుకు గాను నోబెల్ కమిటీ ఆయన్ను బహుమతికి ఎంపిక చేసింది. ఫ్రిట్జ్ చేసిన ఆవిష్కరణ వల్ల పురుమందుల తయారీకి మార్గం సులభం అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో విప్లవాత్మకమార్పులు వచ్చాయి. అయితే, మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీకి ఫ్రిట్జ్ అందించిన సాయాన్ని ఎంపిక కమిటీ పట్టించుకోలేదు. 1915లో బెల్జియంపై జర్మనీ చేసిన క్లోరిన్ దాడికి ఫ్రిట్జ్ సాయం చేశారు. ఈ దాడిలో వేల మంది బెల్జియం జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. 2. క్యాన్సర్ ను కనుగొన్నాడని బహుమతి ప్రధానం చేస్తే.. డానిష్ శాస్త్రవేత్త జోహన్నెస్ ఫిబిజెర్ 1926లో వైద్యరంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఎలుకల్లో క్యాన్సర్ కు కారణం అవి బొద్దింకలను తినడమేనని ఫిబిజెర్ పేర్కొన్నారు. దీన్ని సరియైన ఆవిష్కరణగా భావించిన ఎంపిక కమిటీ సభ్యులు ఆయనకు వైద్యరంగంలో నోబెల్ బహుమతిని అందజేశారు. కానీ ఆ తర్వాతి పరిశోధనల్లో విటమిన్-ఏ లోపం కారణంగా ఎలుకలకు క్యాన్సర్ వ్యాధి వస్తోందని తెలిసింది. 3. మంచి, చెడు రెండు చేసినా.. స్విస్ రసాయన శాస్త్రవేత్త పాల్ ముల్లెర్ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన డైక్లోరోడైఫినైల్ ట్రైక్లోరోఈథేన్(డీడీటీ)ను కనుగొన్నందుకు 1949లో నోబెల్ బహుమతి వరించింది. డీడీటీ ఆవిష్కరణ వల్ల పంటను నాశనం చేసే కీటకాలు, దోమలను తక్కువ సమయంలో హతమర్చాడం వీలైంది. దక్షిణ యూరప్ లో డీడీటీ వల్ల మలేరియా మరణాలు గణనీయంగా తగ్గాయి. దీంతో నోబెల్ కమిటీ ఆయన్ను నోబెల్ బహుమతితో సత్కరించింది. అయితే, 1960లో వాతావరణనిపుణులు డీడీటీ కారణంగా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు. 1972లో అమెరికా డీడీటీపై నిషేధం విధించింది. 2001లో అంతర్జాతీయంగా డీడీటీపై నిషేధాన్ని విధించారు. మలేరియా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో దీని వినియోగంపై నిషేధం విధించలేదు. 4. విపరిణామాలకు కారణమైంది పోర్చుగీసుకు చెందిన శాస్త్రవేత్త ఆంటియో ఈగాస్ మోనిజ్ 1949లో మానసిక వ్యాధికి చికిత్సను కనిపెట్టారు. ఆ తర్వాత ఈ చికిత్స ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని కూడా గడించింది. దీంతో ఎంపిక కమిటీ ఆంటియో చేసిన ఆవిష్కరణ సైకియాట్రిక్ చికిత్సలోనే విలువైనదిగా కీర్తించి, నోబెల్ బహుమతిని ప్రదానం చేసింది. 1950ల్లో మానసిక చికిత్స కోసం పలు వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఆంటియో కనిపెట్టిన చికిత్సా విధానం కారణంగా రోగులు మరణించడం, మెదడు దెబ్బతినడం, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఉండిపోవడం లాంటి విపరిణామాలు పెద్ద సంఖ్యలో సంభవించాయి.