నేటి నుంచి ‘నోకియా–5’ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
ధర రూ.12,499
న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్ అధికారాలను చేజిక్కించుకున్న హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా భారత్‌లో ‘నోకియా–5’ స్మార్ట్‌ఫోన్ విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీని ధర రూ.12,499. ‘నోకియా–5’ స్మార్ట్‌ఫోన్స్ నేటి(ఆగస్ట్ 15) నుంచి ప్రధాన నగరాల్లో లభిస్తాయని కంపెనీ తెలిపింది.
ఆండ్రాయిడ్ 7.1.1 నుగోట్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది.