Nokia X Series
-
10 సెకన్లలోనే ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్
హెచ్ఎండీ గ్లోబల్ ఆకట్టుకునే ఫీచర్లతో 'ఎక్స్' సిరీస్ లోని తన మొదటి స్మార్ట్ ఫోన్ ‘నోకియా ఎక్స్6’ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను నేడు జేడీ.కామ్, సన్నింగ్.కామ్, టీమాల్.కామ్‌లలో తొలిసారి విక్రయానికి వచ్చింది. సేల్కు వచ్చిన 10 సెకన్ల కంటే తక్కువ వ్యవధిలోనే నోకియా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్ అవుటాఫ్ స్టాక్ అయింది. తొలి సేల్ కోసం సుమారు 7 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు నోకియాపవర్హౌజ్ వెల్లడించింది. రెండో సేల్ మే 30న కంపెనీ నిర్వహించనుంది. ఆ సేల్ కోసం ప్రస్తుతం కంపెనీ రిజిస్ట్రేషన్లను చేపడుతోంది. ఏఐతో డ్యూయల్ రిలయర్ కెమెరా సెటప్, హెచ్డీఆర్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,298 సీఎన్‌వై(సుమారు రూ.13,800)గా ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర 1,499 సీఎన్‌వై(సుమారు రూ.16వేలు) కాగ, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 సీఎన్‌వై(సుమారు రూ.18,100)గా కంపెనీ నిర్ణయించింది. నోకియా ఎక్స్6 స్పెషిఫికేషన్లు... డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 5.8 అంగుళాల ఫుల్-హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2.5డీ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 636 ఎస్ఓసీ 16 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో వెనుక డ్యూయల్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమరా 256జీబీ వరకు విస్తరణ మెమరీ 3060 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా ‘ఎక్స్ఎల్’ పెద్ద స్క్రీన్ మొబైల్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ డివెసైస్ కంపెనీ నోకియా ఎక్స్ సిరీస్‌లో అతి పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్, నోకియా ఎక్స్ఎల్ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.11,489. ఈ ఎక్స్ఎల్ మొబైల్లో 5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1 గిగా హెట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఆన్‌బోర్డ్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. ఫేస్బుక్, లైన్, పిస్కర్ట్, ప్లాంట్స్ వర్సెస్ జొంబీస్ 2, రియల్ ఫుట్‌బాల్ 2014, స్కైప్, స్పోటీఫై, స్విఫ్ట్ కీ, ట్విట్టర్, వైబర్, వైన్, విచాట్ వంటి యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. గతంలో తామందించిన నోకియా ఎక్స్ మొబైల్ ఫోన్‌కు మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహాంతో ఈ నోకియా ఎక్స్ఎల్ను అందిస్తున్నామని నోకియా ఇండియా డెరైక్టర్ (సేల్స్) రఘువేష్ సరూప్ చెప్పారు. వివిధ ధరల్లో నోకియా ఎక్స్ మొబైల్ ఫోన్లను అందించనున్నామని వివరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా నోకియా ఎక్స్ ఫోన్లకు బ్లాక్బెర్రిమెసేజింగ్(బీబీఎం)ను యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌తో కూడిన అవగాహన మేరకు ఈ ఫోన్ కొనుగోలుపై 500 ఎంబీ వరకూ డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తున్నామని, నోకియా స్టోర్, వన్ మొబైల్ స్టోర్ నుంచి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. కాగా నోకియా ఎక్స్ సిరీస్‌లో నోకియా ఎక్స్ మొబైల్ ధర రూ.8,599(విడుదల నాటి ధర), నోకియా ఎక్స్ ప్లస్ ధర రూ.8,399 గా ఉన్నాయి.