nominations nil
-
స్థానిక పోరులో.. జాడలేని ‘దేశం’!
తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తోంది. స్థానిక సంస్థల పోరులో ఆ పార్టీ ఉనికి ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ తరఫున జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు ముందుకు వస్తున్న నాయకులు నామ మాత్రంగా కూడా లేరు. బుధవారం ముగిసిన తొలి విడత నామినేషన్లలో కూడా ఆ పార్టీ నుంచి స్వల్పంగానే దాఖలయ్యాయి. ఇక, జెడ్పీ చైర్మన్ పీఠం గురించి ఆలోచించే స్థితిలో పార్టీ నాయకత్వం కనిపించడం లేదు. సాక్షిప్రతినిధి, నల్లగొండ : తెలుగు దేశం పార్టీ జిల్లాలో నామమాత్ర ఉనికి కూడా చాటడం లేదు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటినుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క స్థానం నుంచి కూడా టీడీపీ అభ్యర్థులు పోటీ చేయలేక పోయారు. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ కింది స్థాయి నాయకులకు అండగా నిలిచిన వారు లేరు. దీంతో పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ ఉనికి కనిపించలేదు. ఈనెలలోనే జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ అభ్యర్థులను పెట్టలేదు. ఇపుడు పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల వంతు వచ్చింది. ఈఎన్నికల్లోనూ టీడీపీ అడ్రస్ కనిపించడం లేదు. మొత్తానికి మొత్తంగా ఎన్నికల పోరుకు తెలుగుదేశం పూర్తిగా నీళ్లొదిలినట్టే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు జిల్లా అధ్యక్షుడు జంప్ జిల్లాలో తెలుగుదేశం ఇక కోలుకునేలా వాతావరణం కానీ, అనుకూల పరిస్థితులు కానీ కనిపించడం లేదు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా టీడీపీని వీడారు. కొత్త నాయకత్వం తయారవుతుందన్న విశ్వాసం కూడా కలగడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు టీడీపీ జిల్లా అధ్యక్షుడు యూసుఫ్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలు రావడంతో ఆ పార్టీని నడిపించే జిల్లా నాయకత్వం లేకుండా పోయింది. ఈ కారణంగానే కార్యకర్తల్లో మనోధైర్యం నింపి ముందుకు నడిపించే వారే లేకుండా పోవడంతో పార్టీని నమ్ముకుని పోటీ చేసే ధైర్యం చేయలేక ‘తమ్ముళ్లు’ ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో రెండు సార్లు జెడ్పీ పీఠంపై టీడీపీ జిల్లాలో టీడీపీది ఇక గత చరిత్రే. ప్రస్తుతం ఆ పార్టీ జిల్లాలో బోర్డు తిప్పేసినట్టేనన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జిలాపరిషత్ చైర్మన్ పీఠాన్ని ఆ పార్టీకి చెందిన నాయకులు రెండు పర్యాయాలు అధిష్టించారు. టీడీపీ నుంచి బొందుగుల నర్సింహారెడ్డి, సీడీ రవికుమార్‌లు జెడ్పీ చైర్మన్లుగా పనిచేశారు. జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యేలను గెలుచుకున్న చరిత్రా టీడీపీకి ఉంది. టీడీపీ నుంచి ఇక్కడి నుంచే ఎంపీలుగా గెలిచిన వారూ ఉన్నారు. ఇప్పుడా చరిత్రంతా గతమేనని పేర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో పలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఉనికి చాటుకున్న టీడీపీ.. ఆ తర్వాత ఒక్కొక్క నాయకుడిని కోల్పోయింది. జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన బిల్యానాయక్, రమేష్ రెడ్డి, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఇలా.. వరుసబెట్టి నాయకులంతా పార్టీని వీడారు. ఉన్న కొద్దిమంది నేతలతో బండిని నడిపించాలని చూసినా.. మొన్నటి ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా టీడీపీ నుంచి వలసలు ఆగలేదు. ఇప్పుడా ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తోంది. ఇక, ఆ పార్టీ జిల్లాలో చాప చుట్టేసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘స్థానిక’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మంగళవారం విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 28 వరకు స్వీకరిస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దాఖలు చేయొచ్చు. మార్చి ఒకటిన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు మూడో తేదీ ఆఖరి గడువు. పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు బీ ఫారం ఈ నెల 28వ తేదీ మూడు గంటల్లోగా చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి, రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు. అభ్యర్థి గానీ, వారి తరఫు పది మంది ప్రతిపాదకుల్లో ఒకరు గానీ నామినేషన్ దాఖలు చేయొచ్చు. ప్రతిపాదకులు స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలో నమోదై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు, ఇతరులకు రూ.10 వేలు డిపాజిట్‌గా నిర్ణయించారు. అభ్యర్థి ఎలక్ట్రోరల్ జాబితా సర్టిఫైడ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. కాగా.. తొలి రోజున ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. -
తొలి రోజు నామినేషన్లు నిల్
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన కలెక్టర్ ముగిసిన కొత్త ఓటరు దరఖాస్తుల స్వీకరణ మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 18,671 దరఖాస్తులు 26 లోగా ఓటర్ల జాబితాతో ఫొటోలు అనుసంధానం నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆర్డీఓలు, మన జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నోటిఫికేషన్ జారీ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్నిక ల సంఘానికి పంపించారు. కాగా తొలి రోజు ఏ పార్టీ అభ్యర్థి నుంచి కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. పట్టభద్రులు ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు కూడా గురువారంతో ముగిసింది. ప్రాథమిక సమాచారం మేరకు మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 18,671 దరఖాస్తులు వచ్చాయి. దీంట్లో నల్లగొండ-5,332, వరంగల్-8 వేలు, ఖమ్మం-5,339 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ఆధారంగా శుక్రవారం నుం చి రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విచారించనున్నారు. ఇదిలావుంటే ఫొటో ఓటర్ల జాబితా పూర్తి చేయడానికి తహసీల్దార్లు సహకంచాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయ ణ కోరారు. ఈ నెల 26 తేదీలోగా ఓటర్ల జాబితాతో ఫొటోల అనుసంధానం పూర్తిచేయాలని తహసీల్దార్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఓటరు జాబితాలో పేరు నమోదై స్థానికంగా లేకున్నా.. మరొక ప్రాంతానికి వలసవెళ్లినా లేదా చని పోయినట్లయితే అట్టి వివరాలను కూడా నమోదు చేస్తారు. కానీ ఓటరు జాబితా నుంచి పే ర్లు తొలగించరు. పోలింగ్ రోజున ఆ ఓటరు సరియైన గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి వెళ్లినట్లయితే ఓటు వేసేందుకు అనుమతిస్తారు.