ఇక సర్జరీతో పనిలేదు!
ఊబకాయులకు తీపి కబురు.సర్జరీ అవసరం లేకుండా బరువు తగ్గే విధానాన్ని రేడియాలజిస్ట్లులు కనుగొన్నారు. ఫోటో ఆధారిత ట్రీట్మెంట్ బేరియాట్రిక్ ఆర్టేరియల్ ఎమ్బాలిసేటన్ (బీఏఈ)పద్ధతి ద్వారా రోగి పొట్టలోని ఒక భాగానికి రక్తప్రసరణను తగ్గించి బరువు తగ్గేలా చేస్తారు.
ప్రస్తుతం అనుసరిస్తున్న శస్త్రచికిత్స సర్జికల్ గ్యాస్టిక్ట్ బైపాస్ కు విభిన్నంగా ఎటువంటి ఆహార,వ్యాయామ నియమాలతో పనిలేకుండా బీఏఈ పనిచేస్తుందని యూఎస్ లోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకుడు క్లిఫార్డ్ వెసిస్ తెలిపారు. ప్రాథమిక దశ పరిశోధనల్లో బీఏఈ ప్రస్తుతం అమల్లో ఉన్న చికిత్స కంటే మెరుగ్గా ఉంది.కొంత మంది రోగుల మీద జరిపిన పరిశోధనల్లో మొదటి నెలలో 5.9 శాతం, ఆరు నెలల తర్వాత 13.3 శాతం బరువుల్లో సగటు తేడాలు కనిపించాయి.