సైక్లింగ్ చాంపియన్ నార్త్ వెస్ట్రన్ రైల్వే
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వేస్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో నార్త్ వెస్ట్రన్ రైల్వే చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స అసోసియేషన్ (ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ ట్రాక్‌పై జరిగిన ఈ పోటీల్లో మొత్తం 64 పాయింట్లతో నార్త్ వెస్ట్రన్ రైల్వే అగ్రస్థానాన్ని దక్కిం చుకోగా... నార్తర్న్ రైల్వే (43) రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 9 జోన్లు పాల్గొన్న ఈ టోర్నీలో సౌత్ సెంట్రల్ రైల్వే 30 పాపాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 4కి.మీ టీమ్ పర్స్యూట్ విభాగంలో విజేత నార్త్ వెస్టన్ర్ రైల్వే జట్టుకు సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) గట్టి పోటీనిచ్చింది. అయినప్పటికీ ఎస్సీఆర్ రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సరిపెట్టుకుంది.
విజేతలకు ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా బహుమతులు ప్రదానం చేశారు. విజేత ఆర్నిరెడ్డి జంట సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్లో ఆర్ని రెడ్డి జోడి విజేతగా నిలిచింది. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో ఆర్ని రెడ్డి- పి. అమూల్య ద్వయం 7-5, 7-5తో సాయి ధన్వి-శ్రేష్టజోడిపై విజయం సాధించింది. బాలుర డబుల్స్ ఫైనల్లో కోట శశిధర్- కౌశిక్ కుమార్ ద్వయం 6-3, 6-2తో కార్తీక్ నీల్- శ్రీశరణ్ జోడీపై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. సింగిల్స్ విభాగంలోనూ శశిధర్ 6-4, 6-4తో వరుణ్ కుమార్‌పై గెలుపొందాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో తనుషిత 6-3, 5-7, 7-6 (5)తో సాయి ధన్వి లాలసను ఓడించి విజేతగా నిలిచింది. అనంతరం విజేతలకు ట్రోఫీలను అందజేశారు.