ఆఫ్ఘన్లో భూకంపం : 17 మందికి గాయాలు
కాబూల్ : ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లోని పాకిస్థాన్ - కజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదు అయింది. ఈ భూకంప ప్రమాదంలో 17 మంది ప్రజలు గాయపడ్డారని యూఎస్ జియోలాజికల్ సర్వే శనివారం వెల్లడించింది. భూమి కంపించడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని పేర్కొంది.
రాత్రంతా భయకరమైన చలిలో రోడ్లపైనే ప్రజలు జాగారం చేశారని వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని 203 కిలోమీటర్ల దూరంలో కనుగోన్నట్లు తెలిపింది. ఈ భూకంప ప్రభావం భారత్‌లో కనిపించింది. భారత్‌లోని హిమాలయా పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలతోపాటు న్యూఢిల్లీలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది.