జపాన్‌లో భూకంపం
టోక్యో: జపాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది.
పసిఫిక్ మహాసముద్రం హన్ష్ ద్వీపంలోని తూర్పు కోస్తా ప్రాంతంలో 38.9 కిలోమీటర్ల అడుగు భాగంలో ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. సునామీ హెచ్చరికలు కూడా ఏమీ చేయలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది.