northern white rhinos
-
నా ప్రియ నేస్తానికి ఈ సెంచరీ అంకితం : రోహిత్
బ్రిస్టన్: టీ20 సిరీస్ గెలుపుతో టీమిండియా సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో మంచి శుభారంభం చేసింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఓపెనర్ రోహిత శర్మ ఆ సెంచరీని తనకు ఇష్టమైన సూడాన్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్లని ఖడ్గ మృగం సూడాన్ గత మార్చిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కెన్యాలోని ద్వార్ క్రలోవే జూలోని 45 ఏళ్ల ఖడ్గ మృగం మరణంపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రోహిత్ శర్మ కూడా ఒకడు. సోమవారం ట్విటర్లో ‘ నిన్నటి నా సెంచరీని చనిపోయిన నా ప్రియ నేస్తం సూడాన్‌కు అంకితమిస్తున్నాను. మనమంతా మంచి జీవనానికి ఓ మార్గం కనుగోవాలనేమో’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఇది తెగ వైరల్ అయింది. ఈ అరుదైన రైనో మరణంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సైతం అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మనమంతా సూడాన్ రక్షించడంలో విఫలమయ్యాం. జంతు ప్రేమికులారా ఇప్పటికైనా మేల్కొనండి, రైనోస్ అన్నిటిని రక్షిద్దాం.’ అని పిలుపునిచ్చాడు. శతకంతో ఆకట్టుకున్న రోహిత్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ జూలై 12న ప్రారంభం కానుంది. Yesterday’s innings is dedicated to my fallen friend Sudan 🦏 May we find a way to make this world a better place for all of us. pic.twitter.com/wayEjDlUyA — Rohit Sharma (@ImRo45) July 9, 2018 -
అల్విదా మేరా దోస్త్..
మరణానికి మరికొన్ని క్షణాలు.. ఓ జాతి అంతరించడానికి మరికొన్ని క్షణాలు.. సూడాన్ శాశ్వత నిద్రకు మరికొన్ని క్షణాలు.. రిజర్వు పార్కు రేంజర్ ముథాయ్ పరుగుపరుగున వచ్చాడు.. మరికొన్ని క్షణాల్లో ఈ లోకాన్ని విడిచివెళ్తున్న తన మిత్రుడికి తుది వీడ్కోలు పలకడానికి.. సూడాన్‌ను చూడగానే ఎప్పుడూ తన మోముపై వికసించే నవ్వు నేడు నేలరాలింది.. రెప్పచాటు ఉప్పెన కట్టలు తెంచుకుంది..అక్కడే అలా కూలబడ్డాడు..సూడాన్‌ను ప్రేమగా నిమిరాడు..చివరిసారిగా... అల్విదా మేరా దోస్త్.. సూడాన్.. ప్రపంచంలోనే ఏకైక మగ నార్తర్న్ వైట్ రైనో(45).. ఒకప్పుడు ఉగాండా, సూడాన్, కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఎక్కువగా ఉండేవి. కొమ్ముల కోసం వేటగాళ్లు ఈ ఖడ్గమృగాలను విచ్చలవిడిగా వధించడంతో అంతరించే దశకు చేరాయి. చివరికి మగ నార్తర్న్ వైట్ రైనోల్లో సూడాన్ ఒక్కటే మిగిలింది. ఆ జాతి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడటంతో చెక్ రిపబ్లిక్‌లోని జూలో ఉన్న దీన్ని 2009లో కెన్యా ఫారెస్టు రిజర్వ్ పార్కుకు తెచ్చారు. సూడాన్‌తోపాటు రెండు ఆడ నార్తర్న్ వైట్ రైనోలనూ కూడా తెచ్చి.. సంతానోత్పత్తి చేయించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేటగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు సూడాన్‌కు సాయుధ రక్షణను కూడా ఏర్పాటు చేశారు. వాచ్ టవర్స్, డ్రోన్లు, వేట కుక్కలు వంటివాటిని పెట్టారు. దీంతో సూడాన్ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ అయింది. లక్షల మంది దీన్ని చూడ్డానికి వచ్చేవారు. అయితే, వీటి సంతతిని పెంచడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత తర్వాత సూడాన్ ఆరోగ్యం క్షీణించింది. కనీసం లేవలేని పరిస్థితి వచ్చింది. దీని బాధను చూడలేక సూడాన్‌కు కారుణ్య మరణం ప్రసాదించినట్లు మంగళవారం రిజర్వు పార్కు ప్రకటించింది. ఓ వైద్యుడు ఇంజెక్షన్ ద్వారా సూడాన్‌కు విముక్తినిచ్చినట్లు తెలిపింది. అది జరడానికి కొన్ని క్షణాల ముందు.. సూడాన్ మృత్యువు ముంగిట ఉన్న సమయంలో తీసిన చిత్రమే ఇది. ప్రకృతి పట్ల, సాటి జీవుల పట్ల మానవుడు చూపుతున్న క్రూర స్వభావానికి నిదర్శనంగా సూడాన్ చరిత్రలో నిలిచిపోతుందని రిజర్వు పార్కు సీఈవో రిచర్డ్ అన్నారు. ‘కేవలం తన జాతికే కాదు.. మానవుడి అక్రమ కార్యకలాపాల వల్ల అంతరించిపోయే దశలో ఉన్న అనేక వేల జంతు, పక్షి జాతులకు ప్రతినిధిగా వ్యవహరించాడు’అని చెప్పారు. మిగిలినవి రెండూ ఆడ ఖడ్గమృగాలు కావడంతో ఇక ఈ జాతి అంతరించినట్లే అని చెబుతున్నారు. అయితే, శాస్త్రవేత్తలు చనిపోయే ముందు సూడాన్ జెనెటిక్ మెటీరియల్‌ను సేకరించారని.. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఈ జాతిని రక్షించేందుకు తమ ప్రయత్నాలు సాగుతాయని రిచర్డ్ చెప్పారు. -
ఆ జంతువుకు సాయుధ బాడీ గార్డ్స్!
జంతువుకు సాయుధ బాడీ గార్డ్స్ ఏంటీ అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం. ఆ జంతువుకు చుట్టూ పదుల సంఖ్యలో బాడీ గార్డ్స్. దానిపై ఈగ కూడా వాలకుండా, ఏ లోటూ రాకుండా చూసుకుంటారు. అది ఎక్కడకు వెళ్తే అక్కడకు వాళ్లు కూడా దాని వెంటే ఆయుధాలు పట్టుకుని నడుస్తూ వెళ్తారు. రోజంతా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కెన్యాలోఓ రైనోకు జరుగుతున్న మర్యాదలు ఇవి. ప్రపంచంలో అంతరించిపోవడానికి అత్యంత దగ్గరలో ఉన్న జంతుజాతికి చెందినవి నార్తర్న్ వైట్ రైనోస్. అందులోనూ ఈ భూమ్మీద ఈ జాతికి చెందిన మగ రైనో ఒక్కటే ఉంది. దీంతో కెన్యా ప్రభుత్వం దానిని రక్షించుకోవడానికి భారీ చర్యలే చేపడుతోంది. దానికి ఎటువంటి హాని కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసింది. కెన్యాలో ఈ జాతికి చెందిన ఆడ రైనోలు రెండు ఉన్నాయి. ఎలాగైనా వీటితో మగ రైనోను సంపర్కం జరిపించి ఆ జాతిని అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో వయస్సు మీద పడిన ఏకైక మగ రైనోకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా కూడా ఈ చర్యలు తీసుకుంటున్నారు.