ఎన్కౌంటర్పై.. ‘నో కామెంట్’
తిరువళ్లూరు(తమిళనాడు): ఏపీలో తమిళనాడు కూలీలపై జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై స్పందించబోనని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. తిరువళ్లూరులోని ప్రసిద్ధ ఆలయం వీరరాఘవ స్వామి దర్శనం కోసం 3 నెలలకోసారి ఆయన వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం తన సతీమణితో వచ్చిన ఆయనను దర్శనానంతరం మీడియా ప్రతినిధులు చుట్టముట్టారు. ఎన్కౌంటర్పై మాట్లాడాలని పట్టుబట్టారు.
దీంతో ఆయన తల ఊపుతూ ముందుకు కదిలారు. అయితే, మీడియా మాత్రం మాట్లాడాలని కోరింది. దీంతో ఆగ్రహించిన భద్రతా సిబ్బంది మీడియాను తోసేశారు. దీంతో మీడియా ప్రతినిధులకు, భద్రతా సిబ్బందికి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. అనంతరం, తిరుగు ప్రయాణమవుతున్న గవర్నర్ను మీడియా ప్రతినిధులు మరోసారి చుట్టముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో నిమిషం పాటు ఆలోచించిన గవర్నర్.. ‘నో కామెంట్.. నో కామెంట్’ అంటూ వెళ్లిపోయారు.