not complete
-
2019 నాటికి పోలవరం కష్టమే
-
అయోమయం
- కొలిక్కిరాని బదిలీలు, రేషనలైజేషన్ – జుట్టు పీక్కుంటున్న అధికారులు – ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ), ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అంధకారంగా మారింది. మార్గదర్శకాలపై జీఓలు, టీచర్ల బదిలీపై షెడ్యూలు ఇచ్చి చేతులు దులుపుకుంది. క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. షెడ్యూలు ప్రకారం రేషనలైజేషన్ ((హేతుబద్ధీకరణ) ప్రక్రియ ఈ నెల 8 నాటికి పూర్తి కావాల్సి ఉంది. శుక్రవారం నుంచి 12 వరకు అన్ని కేడర్లు టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే రేషనలైజేషన్ ప్రక్రియ కొలిక్కి రాలేదు. మరోవైపు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ పని చేయడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రేషనలైజేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వివిధ అంశాలు ప్రతిబంధకంగా మారాయి. హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయితే పలు పాఠశాలలు మూతపడనున్నాయి. ఉపాధ్యాయ పోస్టులను ఇతర పాఠశాలలకు బదలాయించనున్నారు. ముఖ్యంగా యూపీ స్కూళ్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదు. చాలా స్కూళ్ల నుంచి బయాలజీ టీచర్లు బయటకు రానున్నారు. వారిని ఎలా సర్దుతారనే దానిపై సమాచారం లేదు. హేతుబద్ధీకరణ పూర్తయితేనే టీచర్ల బదిలీల ప్రక్రియ ముందుకు సాగుతుంది. తలనొప్పిగా పాయింట్ల కేటాయింపు మరోవైపు టీచర్లకు వివిధ ప్రతిభ ఆధారిత పాయింట్లు కేటాయింపు తలనొప్పిగా మారింది. సంబంధిత ఉపాధ్యాయులు ఫలానా పాయింట్లు తనకు వర్తిస్తాయని ఎంఈఓలకు వినతులిచ్చారు. దీనిపై రికార్డులు పరిశీలించేందుకు స్కూళ్లు పునఃప్రారంభం కాలేదు. ఇదే అదనుగా అక్రమాలకు చోటు చేసుకునే వీలుంది. మండల విద్యాశాఖ అధికారులు, డెప్యూటీ డీఈఓలు ధ్రువీకరించే పాయింట్లపై కొందరు వ్యాపారం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. – పదో తరగతిలో 90–99.99 శాతం మంది ఉత్తీర్ణత సాధించి ఉంటే 5 పాయింట్లు, 80–89.99 శాతం మంది ఉత్తీర్ణత సాధించి ఉంటే 3 పాయింట్లు ఇస్తారు. ఇది కేవలం ఉన్నత పాఠశాలల టీచర్లకే మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే పదో తరగతి ఆ స్కూళ్లలో మాత్రమే ఉంటుంది. మరి ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల పరిస్థితి ఏమిటి? తాము స్కూల్ అసిస్టెంట్లు కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. – మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి 90 శాతం రోజుల్లో గడువులోగా ఆన్లైన్లో ఇండెంట్ వివరాలు పంపింటే 2 పాయింట్లు. 80–89.99 శాతం రోజుల్లో పంపింటే 1 పాయింటు కేటాయిస్తారు. వాస్తవానికి ఇండెంట్ దాదాపు ప్రతి మండలంలోనూ ఎమ్మార్సీ సిబ్బందే పంపుతున్నారు. మరి ఏస్కూల్లో ఏ టీచరుకు పాయింట్లు కేటాయిస్తారన్నది అంతుచిక్కడం లేదు. – స్పౌజ్ పాయింట్లు వినియోగించుకునేందుకు 8 ఏళ్లా లేక 8 ఏళ్లు పూర్తి కావాలా? దీనిపై స్పష్టత లేదు. – పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్ పోస్టుల్లో ఉన్న పండిట్లు, పీఈటీలు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో లేదు. స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీల ప్రక్రియ రేషనలైజేషన్ ప్రక్రియ ఇంకా తేలలేదు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీల ప్రక్రియ ముందుకు సాగుతుంది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం నుంచే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా...వెబ్సైట్ పని చేయడం లేదు. వివిధ పాయింట్లపై స్పష్టత కోసం ప్రభుత్వానికి రాశాం. -లక్ష్మీనారాయణ, డీఈఓ -
ఎర్రగంగ.. దీనంగా..
తాడేపల్లిగూడెం : ‘ఒరేయ్ ఎంకా ఎర్రగంగొస్తోందిరోయ్.. మన కొంపమునిగిందిరో’ ఈ మాటలు వానాకాలంలో మెట్ట ప్రాంత రైతుల నుంచి తరచూ వినిపించేవే. ఎర్రకాలువ ప్రవాహం ప్రతి ఏటా ఇక్కడి అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 20 గ్రామాల ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పంటలను అమాంతం మింగేస్తోంది. దీనికి ప్రధాన కారణం కాలువ విస్తరణ పనులు జరగకపోవడమే ఎర్ర కాలువ వల్ల మెట్ట ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తక్షణ చర్యలు ప్రారంభించారు. చెక్‌డ్యామ్‌ల పునర్నిర్మాణం, అవసరమైన చోట్ల కాలువల విస్తరణ పనులపై దృష్టిపెట్టారు. సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకునేలోగానే ఆయన అమరుడయ్యారు. దీంతో పనుల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రూ.121.83 కోట్లతో అనంతపల్లి నుంచి నందమూరు అక్విడెక్టు వరకూ ఎర్రకాలువ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఈ పనులకు 2013 ఏప్రిల్ 7న అప్పటి కేంద్ర మంత్రి చిరంజీవి తాడేపల్లిగూడెం మండలం మాధవరం వద్ద శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభమై మూడేళ్లు దాటిపోయింది. వాస్తవానికి ఏడాదికే పనులు పూర్తికావాలి. కానీ ఇప్పటికీ మోక్షం కలగలేదు. నందమూరు పాత ఆక్విడెక్టు తొలగింపు వ్యవహారం కొలిక్కిరాలేదు. దీంతో ఎర్రకాలువ పరీవాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులు పూర్తికాక ఏటా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుతూనే.. కాలువ విస్తరణ పనులను ఐదు రీచ్‌లుగా విభజించారు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో 0.00 కిలోమీటరు నుంచి నందమూరు ఆక్విడెక్టు వద్ద 33.370 కిలో మీటరు వరకు ఎర్రకాలువ విస్తరణ, చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు. ప్రముఖ కంపెనీలకు ఈ పనులను అప్పగించారు. అయితే భూసేకరణ సమస్య వల్ల కొంతకాలం పనులు ముందుకు సాగలేదు. త్యాజంపూడి. గుండేపల్లి, వీరంపాలెం ప్రాంతాలలో భూసేకరణ కొలిక్కిరాలేదు. ఇటీవలి కాలంలో వీరంపాలెం ప్రాంతంలో కొంత ప్రాంతం మినహా సమస్య పరిష్కారమైంది. అయినా పనులు వేగం పుంజుకోలేదు. పేరున్న హైగ్రీవ ఇన్ఫ్రా, ఆర్ఎస్ఆర్ ఇన్ఫ్రా వంటి సంస్థలు ఈ పనులను చేజిక్కించుకున్నాయి. అయినా ఏడాదిలోపు పూర్తికావాల్సిన పనులు ఇంకా సగంలోనే ఉన్నాయి. పెరిగిన అంచనాలు నిర్దేశించిన ప్రకారం పనులు ముందుకు సాగకపోవడం, మెటీరియల్ ధరలు పెరగడం తదితర కారణాల నేపథ్యంలో ప్రత్యేక జీఓ ద్వారా ప్రభుత్వం విస్తరణ పనులకు నిధులు పెంచింది. రూ.121.83 కోట్లుగా నిర్ణయించిన ఈ పనుల వ్యయాన్ని రూ.143 కోట్ల 15 లక్షల 40 వేలకు పెంచుతూ గత ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన జీవో నంబర్ 69 విడుదల చేసింది. ముందనుకున్న అంచనాలకంటే సుమారు రూ.22 కోట్ల వ్యయం పెంచినా, పనుల ప్రగతిలో చెప్పుకోతగ్గ మార్పులేదు. కాంట్రాక్టర్ వెనకడుగు ఏడాదిలోపు పనులు పూర్తిచేయనందువల్ల కాంట్రాక్టు సంస్థలకు 50 సీ క్లాజు ప్రకారం మూడు నోటీసులు ఇచ్చారు. దీని ప్రకారం కాంట్రాక్టు రద్దు చేసే అవకాశాలున్నాయి. ఈ పనులలో కొన్ని రీచ్‌లను చేజిక్కించుకున్న ఆర్ఎస్ఆర్ ఇన్ఫ్రా పనుల నుంచి తప్పుకుంటామని చెబుతోంది. దీంతో ఈ పనులు వేరేసంస్థకు అప్పగించాల్సి ఉంది. 55శాతమే పూర్తి విస్తరణ పనులు ఇప్పటివరకూ 55 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇన్లెట్స్ ఆఫ్‌టెక్ స్లూయిస్ (తూములు) , క్యాటిట్ ర్యాంప్స్ (పశువులు నీరు తాగడానికి ర్యాంపులు) ఏర్పాటు, గ్రావెల్ రోడ్లు, గట్ల పటిష్టత పూర్తయిన తర్వాత నందమూరు అక్విడెక్టు తొలగింపు పనులు పూర్తిచేయాల్సి ఉంది. కొంత దూరం పాటు కాలువల విస్తరణ పనులు జరిగిన చోట గట్ల పటిష్ట పనులు చేపట్టాల్సి ఉంది. అప్పారావుపేట వంటి చోట్ల ఇంకా ఈ పనులు మిగిలి ఉన్నాయి. జగన్నా«థపురం నుంచి నందమూరు వరకు ఈ పనులు చాలా చేయాల్సి ఉంది. అప్పారావుపేట – కోరుమామిడి వంతెన సమీపంలో చినబాపన్నకోడు. పెదబాపన్నకోడు చెక్ డ్యామ్‌లు, రామరాజు గట్టు పటిష్ట పరచాల్సి ఉంది. బాపన్నకోడు నుంచి ముష్టికోడు కాలువ, ఇతర కాలువలను విస్తరించాల్సి ఉంది. పూర్తయితే.. విస్తరణ పనులు పూర్తయితే పదివేల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంటుంది. పదివేల ఎకరాల ఆయకట్టు ఉన్నా, విస్తరణ జరగకపోవడం, ఆక్రమణ చెరలో చెరువులు, వాటి కింద బోదెలను పూడ్చివేసిన నేపథ్యంలో వానాకాలంలో పంట చేలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఎర్రకాలువ నీరు కేవలం నాలుగువేల ఎకరాలకు మించి అందని దుస్థితి నెలకొంది. కాలువ ఆక్రమణలు, గట్టు చిక్కిపోవడం, గండ్లు తదితర కారణాల వల్ల 4,500 క్యూసెక్కుల నీరు మాత్రమే ఈ కాలువ ద్వారా దిగువ ప్రాంతాలకు వెళుతోంది. పూర్తిస్థాయిలో పనులు పూర్తయితే 20,250 క్యూసెక్కుల నీరు ఈ కాలువ ద్వారా ప్రవహిస్తుంది. వానాకాలం తర్వాత పనులు వర్షాల వల్ల పనులకు అంతరాయం కలిగిందని, వానాకాలం తర్వాత విస్తరణ æపనులు తిరిగి ప్రారంభమవుతాయని ఇరిగేషన్ డీఈలు అప్పారావు, వెంకటేశ్వర్లు తెలిపారు. 55 శాతం పనులు పూర్తయ్యాయని, రెండు నుంచి ఐదో రీచ్వరకు పనులను పూర్తిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. -
పుష్కరనగర్లు నత్తనడక
పుష్కర నగర్ల ఏర్పాటులో అధికారగణం అలసత్వం ప్రదర్శిస్తోంది. పుష్కర మహోత్సవం ప్రారంభానికి పక్షం రోజుల గడువు కూడా లేని తరుణంలో పనులు నత్తనడకన సాగడం భక్తులను నివ్వెరపరుస్తోంది. భక్తజనం భారీగా విజయవాడ ఘాట్లకు తరలివస్తారని అంచనా వేసినా.. ఆ దిశగా పుష్కర నగర్ పనులను వేగిర పరచడంలో సఫలీకృతులు కాలేకపోవడం సత్వరమే ఆలోచించవలసిన విషయమని అవగతమవుతోంది. సాక్షి, విజయవాడ : దూరప్రాంతాల నుంచి పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల కోసం పుష్కర నగర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 36 పుష్కర నగర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడపైపే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి ఇక్కడ 15 పుష్కర నగర్లు నిర్మిస్తున్నారు. పుష్కరాలకు పట్టుమని పక్షం రోజులు లేనప్పటికీ ఇప్పటికీ ఒక్క పుష్కరనగర్ కూడా సిద్ధం కాలేదు. వచ్చే నెల 10వ తేదీలోగా పుష్కర నగర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పుష్కరనగర్ల వివరాలు.... విజయవాడలో 15, జగ్గయ్యపేటలో రెండు, చందర్లపాడులో రెండు, ఇబ్రహీంపట్నంలో ఐదు, విజయవాడరూరల్లో 3, పెనమలూరులో ఒకటి, మోపిదేవిలో 2, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు లలో ఒక్కొక్కటి, మచిలీపట్నంలో 2, గన్నవరంలో ఒక పుష్కర నగర్ ఏర్పాటు చేస్తున్నారు. నదీతీరానికి దగ్గరగా, బస్సులు వచ్చేందుకు వీలుగా ఉండే చోట వీటిని నిర్మిస్తున్నారు. విజయవాడలో ఎక్కడెక్కడా... విజయవాడలో పున్నమిఘాట్, భవానీఘాట్, సీతమ్మవారి పాదాలు, రాజీవ్‌గాంధీ పార్క్, పాత ఆర్టీసీ బస్టాండ్, గుణదల రైల్వేస్టేషన్, మధురానగర్ రైల్వే స్టేషన్, బసవపున్నయ్య స్టేడియం, సింగ్‌నగర్, వైవీరావు ఎస్టేట్, వైవీరావు ఎస్టేట్ ఎదుట, భవానీపురం లారీస్టాండ్, దూరదర్శన్, వారధి వద్ద ఉడా పార్కు, స్క్రూ బ్రిడ్జి వద్ద, సిద్ధార్థ మెడికల్ కళాశాలలలో పుష్కరనగర్లు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర నగర్లో కల్పించాల్సిన సౌకర్యాలు.... రాష్ట్రం నలుమూలలు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు పుష్కర నగర్లోనే కల్పించాల్సి ఉంది. రైల్వే స్టేషన్ నుంచి పుష్కరనగర్‌కు తీసుకురావడం, పుష్కరనగర్ నుంచి ఘాట్‌కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ నేప«థ్యంలో పుష్కరనగర్‌లో కొన్ని ముఖ్యమైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. 1. సమాచార కేంద్రం 2. పార్కింగ్ 3. వసతి 4. ముఖాలు కడుక్కునేందుకు గదులు 5. దుస్తులు మార్చుకునేందుకు గదులు 6. తాగునీరు 7. ఆహార పదార్థాలు అందజేసే కౌంటర్లు 8. చక్కటి లైటింగ్ 9. 24 గంటల వైద్య శిబిరం 10. అగ్నిమాపక పరికరాలు 11. బస్సులు ఆగేందుకు ప్రదేశం 12. మైక్ ప్రసార కేంద్రం, 13. ఎల్ఈడీ టీవీ, ప్రొజెక్టర్ పాయింట్లు, 14. సామగ్రి భద్రపరుచుకునే గది 15. పాదరక్షలు భద్రపరుచుకునే గది. పనులు ఇలా... – బస్టాండ్ వద్ద : పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్ ఎరైవల్ బ్లాక్‌లో పుష్కర నగర్‌ను నిర్మించారు. నగరంలో ఈ పుష్కరనగర్‌లో పైన షెల్టర్‌తో పాటు ఫ్లోరింగ్ పనులు పూర్తి చేశారు. తాత్కాలిక మరుగుదొడ్ల(మొబైల్ టాయిలెట్స్) తీసుకువచ్చారు. అంతకు మించి ఏమాత్రం పనులు జరగలేదు. – రైల్వేస్టేషన్ వద్ద : రైల్వేస్టేషన్ ఎదురుగా రైల్వేస్టేడియంలోనూ, డీఆర్ఎం కార్యాలయం వెనుకవైపు పుష్కరనగర్లను రైల్వేశాఖ ఏర్పాటు చేస్తోంది. ఈ రెండు చోట్ల కేవలం ఐరన్ పైప్‌తో షెడ్స్ వేస్తున్నారు. కేవలం 10 శాతం పనులు మాత్రమే జరిగాయి. – కృష్ణా, గోదావరి సంగమం : కృష్ణాగోదావరి సంగమంలో నమూనా దేవాలయాలకు పక్కనే పుష్కర నగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు నిర్మాణం పనులు జోరుగా సాగుతుండడంతో పుష్కర నగర్ ఏర్పాటుకు కొద్దిగా ఇబ్బందిగా వుంది. ప్రస్తుతానికి షెడ్లు నిర్మాణదశలోనే ఉన్నాయి. ఇంకా ఫ్లోరింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. – భవానీపురం : భవానీపురంలో మెయిన్ రోడ్డు స్వాతి థియేటర్ సమీపంలోని పుష్కర నగర్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ షెడ్స్ పూర్తికాగా, ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. మొబైల్ టాయిలెట్స్ తీసుకువచ్చినప్పటికీ వాటికి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. – మధురానగర్ రైల్వేస్టేషన్ : మధురానగర్ రైల్వేస్టేషన్ నుంచి నగరానికి వచ్చేదారిలో రైల్వేస్థలంలోనే పుష్కరనగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ షెడ్స్ నిర్మాణం కొద్దిగా మాత్రమే అయ్యాయి. ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొబైల్ టాయిలెట్స్ తీసుకువచ్చారు. – వైవీరావు ఎస్టేట్ వద్ద: వైవీరావు ఎస్టేట్ వద్ద పుష్కర నిర్మాణం ఇప్పుడే ప్రారంభం అయ్యింది. ఇంకా ఫ్లోరింగ్ నిర్మాణం కావాల్సి ఉంది. మొబైల్ టాయిలెట్స్‌తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. – సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆవరణ : సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆవరణలో పుష్కరనగర్ షెడ్స్ నిర్మాణం పూర్తయింది. ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఫ్లోరింగ్ పనులు చివర దశకు చేరాయి. – రామలింగేశ్వర నగర్ : రామలింగేశ్వరనగర్లో పుష్కర నగర బ్యానర్లకే పరిమితం అయ్యింది. ఇక్కడ ఇంకా షెడ్స్ నిర్మాణం ప్రారంభమే కాలేదు. అధికారులు ప్రత్యేక దృష్టి పెడితే తప్ప ఇక్కడ పుష్కర నగర్ సకాలంలో పూర్తికాదు.