ఇష్టంలేని పెళ్లి చేశారని నవవధువు బలవన్మరణం
బోడుప్పల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని నవవధువు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. ఎస్ఐ మగ్బూల్జాని కథనం ప్రకారం... వరంగల్ జిల్లా ఘనాపూర్ మండలం కుందూరు గ్రామానికి చెందిన మంజుల (20)కు ఘట్కేసర్ మండలం చెంగిచెర్లకు చెందిన మహేశ్‌తో గతనెల 22 న వివాహం జరిగింది. మహేశ్ ఆటో డ్రైవర్ కాగా, అత్తమామలు కూలి పనిచేస్తారు.
కాగా, తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని మనోవేదనకు గురవుతున్న మంజుల బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.