నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నోట్లు మార్చి పెడతామంటూ పలువురిని మోసం చేస్తున్న ఈ ముఠాకు చెందిన పదిమందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.20 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కిట్టుగాడు సినిమా దర్శకుడు రామకృష్ణ ఉన్నారు.