సభ్యుల ఆందోళనల మధ్యే చిదంబరం బడ్జెట్
న్యూఢిల్లీ : సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్యే ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. జూలై వరకూ ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి పార్లమెంట్ అనుమతి కోరుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత సభ్యులు స్పీకర్ వెల్లోకి దూసుకు వెళ్లారు. సమైక్య నినాదాలతో హోరెత్తించటంతో స్పీకర్ మీరాకుమార్ జోక్యం చేసుకుని ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు.
అంతకు ముందు ఆయన సభ్యుల గందరగోళం మధ్య బడ్జెట్ను ఎలా చదివేది అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్ నాథ్ జోక్యం చేసుకుని తమకు బాగానే వినబడుతోందని... బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించాలని కోరారు. దాంతో సభ్యుల ఆందోళన మధ్యే చిదంబరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.