ntr death
-
ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం
-
కేసీఆర్.. ఎన్టీఆర్ శిష్యుడిగా స్పందించండి
-
కేసీఆర్‌కు లక్ష్మీపార్వతి లేఖ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి లేఖ రాశారు. ఎన్టీఆర్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె తన లేఖలో కోరారు. ''కుట్ర, మోసంతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి...ఆయన మరణానికి చంద్రబాబు కారకులయ్యారు. నెపం నాపై నెట్టి నన్ను దోషిగా చూపే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ మరణం వెనుక వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి?. కేసీఆర్ మీరు ...ఎన్టీఆర్ శిష్యుడిగా నా అభ్యర్థనను మన్నించండి. చంద్రబాబు ఓ వర్గం మీడియాను అడ్డు పెట్టుకుని వాస్తవాలు కప్పిపుచ్చారు. శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరే కొనసాగించండి'' అని లక్ష్మీ పార్వతి లేఖ ద్వారా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ మరణం: వీహెచ్
చంద్రబాబు చేసిన అవమానం వల్లే ఎన్టీ రామారావు మరణించారని, ఆయన మరణంపై మళ్లీ విచారణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తానని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఎన్టీఆర్ మీద లేనిపోని ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టించింది కాంగ్రెస్ పార్టీయేనని వీహెచ్ తెలిపారు. కావాలంటే బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలి గానీ, శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్‌కు మాత్రం రాజీవ్ గాంధీ పేరు ఉండాల్సిందేనన్నారు. దీనికోసం పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ధర్నా చేస్తామని చెప్పారు.