ఎన్టీఆర్ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తెలుగుదేశం తరపున ఆర్థిక సహాయం అందించేందుకు ఎన్టీఆర్ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఇటీవల బస్సుయాత్ర ద్వారా పరామర్శించామని, వారి ఆర్థికంగా ఆదుకోవాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు.
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన పార్టీ నేతలు ఎర్రబెల్లి ద యాకర్ రావు, పి.రాములుతో కలసి విలేకరులతో మాట్లాడారు. రూ. 2 కోట్లతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిధికి దాతల నుంచి విరాళాలు సేకరిస్తామని, తెలంగాణ రైతుల కోసం ఎవరైనా సాయం చే యవచ్చని పేర్కొన్నారు. ఒక్కో బాధిత రైతు కుటుంబానికి ఈ నిధి ద్వారా రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు.