వివాహిత బలవన్మరణం
పోలవరం : పోలవరం మండలంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అప్పన నాగమణి (40) అనే వివాహిత మంగళవారం వేకువ జామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కడుపు నొప్పి తాళలేక నాగమణి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె సోదరుడు ముక్కు వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్సై కె.శ్రీహరి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.