nyudemokrasi
-
పెన్నూ, గన్నయి పేలిన సుబ్బారావు పాణిగ్రాహి
‘దిక్కుమొక్కు లేని జనం ఒక్కొ క్కరు అగ్నికణం.. సింహకంఠ నాదంతో వస్తారిక కాచుకోండి’ అంటూ తన పాటల్ని విప్లవ రాజ కీయాలతో జోడించిన ప్రజా కవి సుబ్బారావు పాణిగ్రాహి. 1934 సెప్టెంబర్ 8న శ్రీకా కుళం జిల్లా బారువాలో ఒక పూజారి కుటుం బంలో జన్మించాడు. బొడ్డపాడు గ్రామానికి పూజారిగా వచ్చాడు. తామాడ గణపతి, పంచాది క్రిష్ణమూర్తితో కలసి యువకులను ఉద్యమాల్లోకి తెచ్చాడు. తెగింపు సంఘాన్ని పెట్టి ఎందరో యువకులను శ్రీకాకుళ పోరాటంలోకి తీసుకొచ్చాడు. ప్రజల కష్టాలపై ఎన్నో పాటలను, గేయాలను, నాటికలను రాశాడు. ‘ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం’, ‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’ వంటి ఆయన రాసిన పాటలు శాశ్వతంగా నిలిచి పోయాయి. తామాడ చినబాబుతో కలిసి ఆయన చెప్పిన జముకుల కథ ప్రజలను ఉర్రూతలూపింది. ఆయన రాసిన ‘ఓ అరుణ పతాకమా, చేగొనుమా రెడ్ శాల్యూట్’ అనే పాట విప్లవకారులు నిత్యం జెండా వందన వేళ పాడుకునే విప్లవగీతం అయింది. శ్రీకాకుళ గిరిజనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొ న్నాడు. చాగంటి భాస్కరరావు, తామాడ గణపతి అమరత్వం తర్వాత సోంపేట ఏరియా పార్టీ కార్యద ర్శిగా పాణిగ్రాహిని ఎన్నుకున్నారు. అనతి కాలంలో నే అంటే, 1969 డిసెంబర్ 22న పాణిగ్రాహిని రంగమటియ కొండల్లో కాల్చి చంపారు. ఆయన జీవించింది 36 ఏళ్లు మాత్రమే. ప్రజాకళలకు జీవం పోసి వాటిని రాజకీయాలతో జోడించి ఉద్యమ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. గిరిజనులను నిర్వాసితుల ను చేస్తూ, ప్రజాకళల పోషణ పేరుతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ సంస్థల ద్విముఖ దాడిపై కళాకా రులు నేడు ఉద్యమించాలి.. పాణిగ్రాహి లాగా వారి విముక్తి కోసం పనిచేయాల్సిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది. అందుకే పాణిగ్రాహిని స్మరించుకుందాం. (నేడు సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతి) సి.వెంకటేశ్వర్లు సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ -
జస్టిస్ కృష్ణయ్యర్‌కు న్యూడెమోక్రసీ నివాళి
సాక్షి, హైదరాబాద్ : తన జీవితమంతా ప్రజల పక్షం వహించి, ప్రజల ప్రయోజనాల కోసమే నిలబడి, దేశంలో సామ్యవాద సమాజ స్వప్నాన్ని సాకారం చేయాలని గాఢంగా కోరుకున్న జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్‌కు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ నివాళులర్పించారు. కేరళ హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన ఆయన, 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో కేరళలో ఏర్పడిన మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారన్నారు. భూసంస్కరణల అమలుకు, ఇంకా అనేక ప్రజా అనుకూల చర్యల అమలుకు కృషి చేశారన్నారు. మొదట హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రజలకు అనుకూలంగా వ్యాఖ్యానించి, వారికి అనుకూలంగా తీర్పునిచ్చేందుకు కృషిచేశారని పేర్కొన్నారు. -
కరెంట్ కోతలపై రైతుల నిరసన
చేర్యాల, మహబూబాబాద్, జనగామ రూరల్ : కరెంట్ కోతలపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, మండల అధ్యక్షులు కొమ్ము రవి ఆధ్వర్యంలో చేర్యాల మండలంలోని మండలంలోని ముస్త్యాల సబ్‌స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కరెంట్ కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పొన్నాల వైశాలి డిమాండ్ చేశారు. ముస్త్యాల కిష్టయ్య, ఉడుముల బాల్‌రెడ్డి, ఉట్లపల్లి శ్రీనివాస్, ముస్త్యాల యాదగిరి, నాగమల్ల భిక్షపతి, మాదాసు చంద్రమ్మ, బొమ్మగోని రవీంధర్, ఖుర్షీదాభేగం, మంచాల చిరంజీవులు, తాటిపాముల వెంకటేశం, బుడిగె గురువయ్య, వంగాల శ్రీదేవి, పచ్చిమడ్ల వెంకటయ్య, సత్యనారాయణ, పల్లె కనకయ్య, బండారి శ్రీశైలంలతో పాటు పలువురు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని ఏడీఈ కార్యాలయూన్ని రైతులు ముట్టడించారు. కరెంట్ కోతలతో ఎకరం పం టను పండించుకునే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలోజు శ్రీహరి, రాళ్ళబండి నాగరాజు, బద్దిపడగి క్రిష్ణారెడ్డి, నర్సిరెడ్డి, జయరాములు, ఇబ్రహిం, బాల మల్లు, కనకచారి, రాంచంద్రం, మహేశ్, బాల స్వామి, భూమిగారి ప్రభాకర్, పోచయ్య, కిష్టయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, దాని అనుబంధ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కరెంటు కోతలపైన పలు సం ఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళణ కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని న్యూడెమోక్రసీ కురవి సబ్ డివిజన్ నాయకుడు వజ్జ రాము ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా నిలిచి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆలకుంట్ల కొమురయ్య, తుపాకుల వెంకన్న, సత్యం, లిం గయ్య, పెంటయ్య, ముత్తయ్య, పైండ్ల యాక య్య, వెంకన్న, రమేష్, రాజు, తదితరులు పా ల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యం లో జనగామ మండలంలోని పెంబర్తి గ్రామం వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. సంఘం డివిజన్ నాయకులు పంపర మల్లేశం, వై.బాలరాజు, ఏ.ఆంజనేయులు, పీ.అర్జున్, బీ.బాలరాజు, స్వామియాదగిరి పాల్గొన్నారు. -
విదేశీ అప్పులతోనే రూపాయి పతనం
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: విదేశీ అప్పులతోనే రూపాయి విలువ పతనమైందని ఇఫ్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న యూపీఏ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్లో ఇప్టూ ఆధ్వర్యంలో శుక్రవారం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. మన దేశంపై 390 బిలియన్ డాలర్ల అప్పు ఉందని చెప్పారు. ఇందులో 120 బిలియన్ డాలర్ల అప్పులు చేసింది పది కార్పొరేట్ సంస్థలేనని చెప్పారు. ఈ కారణంగానే రూపాయి విలువ పడిపోయిందన్నారు. మన దేశ పాలకులు గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్లి కోట్లాది రూపాయలు అప్పులు చేస్తున్నారని, ఇందుకుగాను ప్రంపంచ బ్యాంకు షరతులకు తలొగ్గుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే సింగరేణి, మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల రెగ్యులర్ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మన పాలకులు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, దేశంలో రూ.27 లక్షల కోట్ల ద్రవ్య లోటు ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల సబ్సిడీ కింద రెండులక్షల కోట్లు మాత్రమే ఖర్చవుతోందన్నారు. మిగతా రూ.25లక్షల కోట్లలో అంబానీ, ల్యాంకో తదితర పెట్టుబడిదారులకు ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఇస్తోందని, మరికొంత మొత్తం పన్నుల బకాయిలు ఉన్నాయని చెప్పారు. యూపీఏ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సి అవసరముందని అన్నారు. సభలో న్యూడెమోక్రసీ నాయకులు గుమ్మడి నర్సయ్య, ఇప్టూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకన్న, జాతీయ ఉపాధ్యక్షుడు డిపి.కృష్ణ, జీఎల్బీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాస్, నాయకులు వి.కృష్ణ, పోలారి, రామయ్య, ప్రసాద్, విజయకుమార్, ఎన్.సంజీవ్, షేక్ యాకుబ్‌షావలి, సీపీఎం నాయకులు సురేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.