వరంగల్లో మంత్రి ఈటల పర్యటన
వరంగల్ : ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి వరంగల్ రూరల్ జిల్లా పరకాల వరకు రూ.170 కోట్లతో నిర్మిస్తున్న నాలుగులైన్ల రోడ్డు పనులను ఆయన పరిశీలించారు.
మండలంలోని ఉప్పల్ రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కమలాపూర్ పెద్ద చెరువు వద్ద, శనిగారం నడికుడ వాగులపై అదనపు వంతెనల నిర్మాణ స్థలాలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ రవీందర్రావు, పలువురు అధికారులు ఉన్నారు.