అక్టోబర్ 6 నుంచి కేయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. పురుషోత్తమ్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.అక్టోబర్ 6 నుంచి నవంబర్ 3 వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, సెకండ్, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. పూర్తి టైం టేబుల్‌ను కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు.