odds
-
470 కోట్ల కాన్పులకు ఒకటి!
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చి అత్యంత అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం 470 కోట్ల ప్రసవాల్లో ఒకరికే సాధ్యమవుతుందని అంచనా. హూస్టన్‌కు చెందిన తెల్మా చియాకా అనే మహిళ శుక్రవారం ఉదయం 4.50–4.59 గంటల మధ్య నలుగురు మగబిడ్డలు, ఇద్దరు ఆడ శిశువులను ప్రసవించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో వారికి కొంతకాలం అడ్వాన్స్డ్ చికిత్స కొనసాగుతుందని వైద్యులు చెప్పారు. -
అసమానత..అమానవీయం
- వివక్ష తొలిగితేనే అభివృద్ధి - ఇంటి నుంచే మార్పు రావాలి - మహిళల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి - జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ‘‘సామాజిక రుగ్మతలన్నింటికీ మూల కారణం అసమానతే. దీనిని రూపుమాపనంత వరకు సమాజానికి శాంతి ఉండదు. అలజడి, ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. వివక్ష..మహిళల జీవితాలను వికసించకుండా చేస్తోంది. నారీమణుల అభివృద్ధికి ఆటంకంగా మారింది. స్త్రీలను గౌరవించే మన సంప్రదాయంలో తరుణీమణులకు తగినంత స్వేచ్ఛ దొరకడం లేదు. వారి అభిరుచులకు..ఆలోచనలకు ప్రాధాన్యం లభించడం లేదు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే అవకాశాలను అందిపుచ్చుకొని అబలలు..భళా అనిపిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ ప్రోత్సాహంఅంతటా ఉండాలి. సమాజంలో మార్పు రావాలి. అసమానత ఎక్కడున్నా అది అమానవీయమే’’ - అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా జడ్జి జి. అనుపమ చక్రవర్తి కర్నూలు(లీగల్): మహిళలు ఎందులోనూ తీసిపోరు..ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి అన్నారు జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి. అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేదని ఏమీ లేదని చెప్పారు ఆమె. కుటుంబ ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి వచ్చినట్లు వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ‘సాక్షి’ తో ఆమె మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. ‘‘ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నేను ఎలాంటి ఒత్తిడికీ గురికాను. ఇంట్లో వివిధ రకాల పనులు ఏ విధంగా చేసుకుంటామో నా కార్యాలయ పనిని కూడా అదే రీతిలో నిర్వహిస్తాను. కుటుంబంలో మహిళ.. భార్య, తల్లి, చెల్లి, అమ్మ, వదిన లాంటి పాత్రలను పోషించినట్లే జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నేను నా పనిని సమర్థంగా నిర్వహిస్తున్నాను. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉండొచ్చు..దానిని అధిగమించేందుకు మన వంతు కృషి చేయాలి. కష్టపడి పనిచేసి సామర్థ్యాన్ని నిరూపించుకుంటే వివక్షలుండవు. ఇంటికి వెళ్తే ఇల్లాలినే.. జిల్లా జడ్జిగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి కేటాయించాల్సిన సమయం కేటాయిస్తాను. సాధ్యమైనంతవరకు కార్యాలయ పనిని కార్యాలయంలోనే పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. కోర్టులో ఉన్నంతసేపు జిల్లా జడ్జిని, ఇంటికి వెళ్తే ఇల్లాలినే. తీరిక సమయంలో ఇంటి పని చేస్తుంటాను. మా కుమారుడు కొన్ని సందేహాలు అడుతుంటాడు.. వాటిని తీర్చడంతోపాటు వాడికి మంచి చెడ్డలు చెబుతుంటాను. అలాగే చదువు విషయాలు తెలుసుకుంటాను. మరచిపోలేని ఘటన.. నా జీవితంలో మరచిపోలేని ఘటన ఏదైనా ఉందంటే అది మా నాన్న నన్ను విడిచి వెళ్లడమే. మా నాన్న లేకపోవడం నాకు ఇప్పటికీ పెద్ద లోటే. నాలో ఇప్పటికీ ధైర్యం ఉందంటే అది నాన్న నింపిందే. వైద్య వృత్తిలో ఉన్న నాన్న నాకు ఎన్నో విషయాలు నేర్పారు. ఇప్పటికీ మా నాయన నా చుట్టూ ఉన్నట్లుగా భావిస్తాను. మా మామ గారు వ్యవసాయం చేసేవారు. నా భర్త లక్ష్మణ్‌రావు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ధైర్యం వీడకూడదు.. మహిళలు ఏదైనా సాధించాలంటే అందుకు తగిన కృషి చేసి విజయం సాధించాలి. అడ్డంకులు వస్తే ధైర్యం వీడకూడదు. అబలలమన్న భావన లేకుండా అన్ని రంగాల్లో రాణించాలి. మహిళల ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయం ఇంటి నుంచే ప్రారంభం కావాలి. -
చెల్లీ ఇక నీకేం కాదు...
చెల్లీ ఇక నీకేం కాదు... అన్నట్టు కనిపిస్తున్న ఆ ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. తన గర్భంలోని ముగ్గురు కవలలనూ కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన సాహసాన్ని వైద్యులూ సవాల్ గా తీసుకున్నారు. ఇద్దరు మగ శిశువుల ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా పాపను రక్షించుకునేందుకు..ఆ తల్లి నెలలు నిండకుండా ముందుగానే ప్రసవం చేయించుకున్న తీరు... అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. ఆస్ట్రేలియాకి చెందిన 22 ఏళ్ళ దన్ స్తాన్ అనే మహిళ ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చింది. నడి గర్భిణిగా ఉండగానే ఆమె ప్రసవానికి సిద్ధమైంది. మరో మార్గం లేని సందర్భంలో ఆమె... 28 వారాల్లోనే ప్రసవం చేయించుకుంది. ఇద్దరు మగ శిశువులతోపాటు... కడుపులో ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న పాపను కూడ రక్షించుకునేందుకు ఆమె భర్త రోహాన్ తో సంప్రదించి ధైర్యం చేసింది. ఆస్పత్రిలో ప్రసవం అనంతరం కాస్త అనారోగ్యంగా ఉన్న బిడ్డలను పదకొండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. అనంతరం ఆ దంపతులు ముగ్గురు బిడ్డలనూ ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళారు. -
మహాలయ అమావాస్య అని భయపడ్డారా?
అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగానే కాకుండా, తొలి ప్రయత్నంలోనే ఆ ఘనతను సాధించిన దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక కక్ష్యలోకి మార్స్ అర్బిటర్ మిషన్ ప్రవేశించడానికి ముందు అందర్నిలోనూ అనేక సందేహాలు, అనుమానాలు వెంటాడాయి. ఎందుకంటే ఈ ప్రక్రియ మంగళవారం రోజున ప్రారంభమైనదే కాకుండా.. ఈ రోజు మహాలయ అమావాస్య కావడం కూడా కొందర్నిలో అనేక సందేహాలు తలెత్తాయి. అయితే అందరి భయాలను, అంచనాలను, సందేహాలను తలక్రిందులు చేస్తూ పాడ్యమి అమావ్యాస సంధికాలంలో అంగారకుడిని మామ్ విజయవంతమవ్వడంతో ప్రత్యక్షంగా దర్శించుకున్నామని వేద పండితులు భావిస్తున్నారు. ఈ ప్రయోగం అంగారకుడికి దుష్పలితాలు తగ్గించే విధంగా జరిగాయని పండితులు అభిప్రాయపడుతున్నారు. అంగారకుడు దుర్గాదేవి సోదరుడని, మంగళవారం అంగారకుడి అనుగ్రహం పొందడం వలన ప్రజలకు దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందన్నారు. అంగారకుడి 9 సంఖ్య అని, ఎక్కువ మంది తొమ్మిదో సంఖ్యకు ప్రాధాన్యమిస్తారని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నమ్మకాలకు తావుందో లేదో కాని.. భారత శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు మామ్ విజయవంత కావడం ద్వారా లభించింది.