తడలో విజిలెన్స్ తనిఖీలు
తడ: నెల్లూరు జిల్లా తడ మండలం భీమునివారిపాలెం చెక్పోస్ట్ వద్ద శుక్రవారం విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు నుంచి వచ్చిన సరుకు రవాణా చేస్తున్న 10 లారీలను అధికారులు నిలిపివేశారు. రవాణా పన్నుల చెల్లింపు విషయంలో సందేహాలు ఉండడంతో పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించేందుకు వీలుగా అధికారులు వాటిని నిలిపివేసినట్టు తెలుస్తోంది. అన్ని లారీల్లోని సరుకును దింపి రికార్డులను పరిశీలించనున్నారు.