officials search
-
పాపులర్ ఫ్రంట్‌పై ఎన్ఐఏ గురి
న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తోపాటు దాని అనుబంధ సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దృష్టి పెట్టారు. చట్టవ్యతిరేక, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సదరు సంస్థలపై ఇప్పటికే కేసు నమోదయ్యింది. కేసు దర్యాప్తులో భాగంగా కేరళలో 12 జిల్లాల్లో పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలకు సంబంధించిన 56 ప్రాంతాల్లో గురువారం అధికారులు సోదాలు నిర్వహించారు. పీఎఫ్ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జోనల్ హెడ్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్–ట్రైనర్స్తోపాటు మారణాయుధాలు ఉపయోగించడంలో శిక్షణ పొందిన మరికొందరి నివాసాల్లో సోదాలు చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి చెప్పారు. మరో 20 మంది అనుమానితుల ఇళ్లను తనిఖీ చేసినట్ల తెలిపారు. ఆయుధాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలపై గతంలోనే కేసు నమోదు చేసింది. -
పొందుగల పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు
పొందుగల : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని పొందుగల గ్రామంలో పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద గురువారం ఇసుక లారీలను అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సముద్రపు ఇసుకను లోడ్ చేసుకుని లారీలు హైదరాబాద్‌కు వెళుతున్నాయి. దీంతో పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద లారీలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. లారీలకు, ఇసుక సరఫరాకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. కొన్ని లారీల పత్రాలు సక్రమంగా లేన్నట్లు అధికారులు గుర్తించారు. పరిశీలన నిమిత్తం నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లారీలను తిప్పి పంపించారు. తనిఖీలు ఆలస్యం అవుతుండటంతో సుమారు 250కి పైగా లారీలు పొందుగల చెక్‌పోస్ట్ వద్ద నిలిచిపోయాయి. ఈ తనిఖీల్లో మైనింగ్ ఏడీ బి.జగన్నాధరావు, ఏజీ విష్ణువర్ధన్, ఎస్సై కట్టా ఆనంద్ తదితరులు ఉన్నారు. తనిఖీలు ఆలస్యం అవుతుండటంతో డ్రైవర్లు, క్లీనర్లు ఇబ్బందులు పడుతున్నారు.