గ్యాస్ ట్యాంకర్ బోల్తా: డ్రైవర్ మృతి
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారుల్లోని హయత్‌నగర్ మండలం కొత్తగూడెం చౌరస్తాలో శుక్రవారం ఇండియన్ అయిల్ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహా అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి లీక్ అవుతున్న గ్యాస్‌ను అగ్నిమాపక సిబ్బంది అరికట్టారు. అనంతరం ట్యాంకర్‌ను రోడ్డుపై నుంచి పక్కకు జరిపారు. మృతి చెందిన డ్రైవర్ మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.